(వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్)
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చిన్న కూతురు వివాహం ఇవాళ దుబాయ్‌లో జరిగింది. దీనికి ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం ఉన్నా ఆమె వెళ్లలేదు. జిల్లాకు చెందిన ఇందూరు బీఆరెస్ నేతలంతా ఇప్పుడు దుబాయ్‌లోనే ఉన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్, రూరల్, అర్బన్ మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేశ్‌గుప్తాలు షకీల్ కూతురు వివాహానికి రెండు రోజుల ముందే వెళ్లారు. అక్కకూ ఆహ్వానం అందింది. కానీ ఆమె వెళ్లలేదు.
తన షెడ్యూల్ తనకు పెట్టుకుని ఆమె బిజీబిజీగా ఉన్నది. మామూలుగానైతే ఆమె .. ఆ వివాహానికి వెళ్లేదే. కానీ బీఆరెస్ ఇందూరు నేతలతో పెరిగిన, పెంచుకున్న గ్యాప్ వల్ల ఆమె అందరినీ దూరం పెట్టింది. తన ఓటమికి కారణం వీళ్లేనని కూడా ఆమె బాహాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఇంకా వాళ్లే ఇంచార్జిల. వారికే బీ ఫారాలు ఇచ్చే అధికారాలిస్తే.. పార్టీ ఏమవుతుంది..? ఇంకా భ్రష్టుపట్టి పోతుందని కేసీఆర్‌కు రాసిన లేఖలోనే ఆమె ఇవన్నీ వివరించింది.
ఈ నేపథ్యంలో ఆమె ఇందూరు జిల్లాలోని గెలిచిన ఎమ్మెల్యే తోపాటు ఓడిన వాళ్లతో కూడా ఇక పై సఖ్యతగా ఉండబోదని అర్ధమవుతోంది. జాగృతి గొడుగు కింద కార్యక్రమాలు చేస్తూ, పార్టీలైన్‌లోనే ఉంటున్నానని చెప్పుకుంటున్నా.. ఆమె కంటూ స్వయంగా ఓ సొత ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకుంటూ పోతున్నది.