(దండుగుల శ్రీనివాస్)
ఆగి ఆగి.. ఆపి ఆపి.. మూడు మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేసి.. ఇందులోనూ తీవ్ర సస్పెన్స్‌ను మెయింటేన్ చేసింది. అధిష్టానం. గడ్డం వివేక్‌కు మంత్రి పదవి రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి చివరి వరకు అడ్డుకున్నాడు. కానీ రాహుల్ కోటాలో వివేక్ కు మంత్రి పదవి దక్కింది. వివేక్‌కు ఇస్తే మాదిగ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని సీఎం చెప్పినా వినలేదు.
వివేక్ ఇస్తే మాదిగకు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని రేవంత్ పట్టుబట్టి కవ్వంపల్లి పేరును సూచించాడు. అయితే సీఎం చెప్పిన పేరును విన్నట్టే విన్న అధిష్టానం.. చివరి నిమిషంలో అడ్లూరి లక్ష్మన్ పేరును లిస్టులో చేర్చింది. ఇది ఊహించని పరిణామం. ఇక్కడి పెద్దలకు కూడా మాట ముచ్చట చెప్పుకుండానే ఇలా మూడో లిస్టు కూర్పును చేశారు. మరోవైపు అలక పానుపెక్కిన అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డ మీనాక్షి నటరాజన్… మిగిలిన మూడింటిలో మీకిస్తాం అంటే మీకిస్తాం అని చెబుతూ వచ్చారు.
కానీ మరో విస్తరణ ఉత్తదేనని వారికి తెలుసు. వీరికే తెలియదు. అరచేతిలో బెల్లం పెట్టారు. మోచేతితితో నాకిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతే.
