హరీష్ రావు మంచి పొలిటీషియన్. ఆయన బీజేపీలో చేరినా రాజీనామా చేసి రావాల్సిందే…నని వ్యాఖ్యానించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

‘బీజేపీలో బీర్ ఎస్ విలీనం ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకాలివి. కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఆ పార్టీ లీడర్లను ఢిల్లీకి పంపి లీకులిస్తున్నరు. ఇచ్చిన హామీలపై ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా ఇది. కేసీఆర్ హయాంలో నాతోసహా బీజేపీ కార్యకర్తలను ఏ విధంగా హింసించారో, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైళ్లో వేశారో ఎవరూ మర్చిపోలేరు. ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటాం? అధికార పార్టీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జనం నమ్మలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 8 ఎంపీ స్థానాల్లో గెలిపించారు..’ అని కరీంనగర్‌లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.