(దండుగుల శ్రీ‌నివాస్‌)

పుట్టిన రోజు నాడు నాలుగు మంచి మాట‌లు మాట్లాడాలె. శుభం కోరుకోవాలె. అంతా బాగుండాల‌నే భావించాలె. కానీ బాపు కేసీఆర్ పుట్టిన రోజునాడూ పాపం రోజు మాద‌రిగా అవే మాట‌లు. అల‌వాటైన దోర‌ణిలో. అది కూడా శున‌కానందం పొందేలా. అర్థం కాలేదా? వ‌స్తున్నా .. అక్క‌డికే. రామ‌న్న .. బాపు కేసీఆర్ బ‌ర్త్ డే నాడు నాలుగు మంచి ముచ్చ‌ట్లు చెప్త‌డేమోనని అంతా అనుకున్నారు. శున‌కం.. శిఖ‌రం అనే ప‌దాలు వాడిండు. కేసీయారేమో శిఖ‌ర‌మ‌ట‌. రేవంతేమో శున‌క‌మ‌ట‌. ఎప్ప‌టికైనా కేసీఆర్ అక్క‌డ్నే పైన శిఖ‌రంలా ఉంటాడ‌ట‌. రేవంతు కిందే నీచంగా శున‌కంలా ఉండిపోతాడ‌ట‌. ఇవీ ఆయ‌న ఉచ్చనీచాలు మ‌రిచి శున‌కానందం పొంది మాట్లాడిన మాటలు. ఈ మాట‌ల‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు రామ‌న్న అహం వీడ‌ని బ‌లుపు మాట‌ల‌కు. నీ బాపును శిఖ‌రం అని అనుకో.. త‌ప్పులేదు. కానీ సీఎంను శున‌కం అన‌డ‌మంటే.. ఆ శిఖ‌రాన్ని ఓడించింది మ‌రి ఈ శున‌క‌మేనా? నువ్వంటున్న‌ది సీఎంను.

శున‌క‌మ‌ని తిడుతున్న‌ది రాష్ట్ర ముఖ్య‌మంత్రిని. అంతిమంగా ప్ర‌జాతీర్పును. అవును. ప్ర‌జ‌లు తీర్పునిస్తేనే గ‌దా సీఎం సీటుపైన కూర్చున్న‌ది.ఇప్పుడు ఫామ్‌హౌజ్‌లో ఉన్న శిఖ‌రం కూడా ఆ ప్ర‌జాతీర్పు వ‌ల్లే అలా ఉండిపోయాడు క‌దా. ఆ తీర్పు అనుకూలంగా వ‌చ్చి ఉంటే ఇప్పుడు ఈ శున‌కం కూర్చున్న కుర్చీలోనే కూర్చుంటుండె క‌దా. అవును సీఎంను తిడుతున్నావా? సీఎం కుర్చీని తిడుతున్నావా? ప్ర‌జాతీర్పును కించ‌ప‌రుస్తున్నావా? ఫామ్‌హౌజ్ తీర్పిచ్చినందుకు జ‌నం మీదే క‌సి తీర్చుకుంటున్నావా? ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి క‌సిగా తిక్క‌గా మాట్లాడిన‌వా? అంతా ఒక‌టే అనుకుంటున్న‌రు. మార‌వా నువ్వు ఇగ‌… అని. ఈ శిఖ‌రం ఆ శున‌క‌పు కుర్చీలో కూర్చోవాలంటే.. శున‌క తీర్పు శిఖ‌రానికి అనుకూలంగా రావాలంటే.. మీరు శున‌కానంద మాట‌లు మాట్లాడ‌టం మానాలే. లేక‌పోతే శిఖ‌రాన్ని ఫామ్‌హౌజ్‌ల‌నే పండ‌వెట్టే శున‌క‌తీర్పు ప‌దే ప‌దే వ‌స్తే.. ఇక శోక‌మే మిగులుతుందని ఆ శున‌కాలు శాపాలు పెడితే.. ఇగ ఎప్ప‌టికి మ‌నం క‌న‌క‌పు సింహాస‌మున ఏతెంచేది రామా!

Srinivas Dandugula

Senior Jounalist

7661066999