(దండుగుల శ్రీనివాస్)
నిజామాబాద్ నిజంగా అనాథే. అవును.. అధికార పార్టీ ఉన్నా.. ఇక్కడ అంతా హేమాహేమీలే ఉన్నా.. ఎవరూ పట్టించుకోని అనాథే. షబ్బీర్ అలీ ఉన్నాడు ఇంచార్జిగా. అతను దత్తపుత్రుడే ఇక్కడి వాళ్లకు. కామారెడ్డికే పరిమితమైండు. సుదర్శన్‌రెడ్డి ఉన్నాడు. మంత్రికాని మంత్రి. బోధన్‌లోనే ఆయనకు పతార లేకుండా పోయింది. ఇక ఇక్కడ నగరంలో ఆయనను పట్టించుకునే వాడే లేడు. గడుగు, నరాల, కేశ వేణు, తాహెర్, మానాల.. అబ్బబ్బ అంతా పెద్దలే. కానీ ఒక్కరూ పట్టుమని పది ఓట్లు సాధించే స్థితిలో లేరు. మరి ఎలా? ఇక్కడ గెలిచేది? బీజేపీ బలంగా ఉంది. లోకల్ ఎమ్మెల్యే బీజేపీనే. అర్వింద్ పంతం మీదున్నాడు. సొంతంగా కోట్లు ఖర్చు చేసైనా మేయర్ పీఠం దక్కించుకోవాలనే తపనతో ఉన్నాడు.
దీనికి తోడు కాంగ్రెస్ మేయర్ క్యాండిడేట్‌గా కాట్పల్లి నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపడం మరింత ఇబ్బందికరంగా మారింది. అప్పటి వరకు ఉన్న పెండింగ్ ఆస్తిపన్ను మొత్తం 8 కోట్లు కట్టించారు కార్పొరేషన్ అధికారులు. దీన్ని కూడా అర్వింద్ అడ్వాంటేజీగా తీసుకున్నాడు. విపరీతమైన ట్రోలింగ్. తనదైన బలమైన సోషల్ మీడియాలో కాంగ్రెస్‌ను ముప్పు తిప్పలు పెట్టే పని నిర్విగ్నంగా చేశాడు ఎంపీ. ఈ తరుణంలో..ఇలాంటి కష్టకాలంలో ఒంటరిగా అంతా తానై నడిపించాడు మహేశ్. సింగిల్ హ్యాండ్ మహేశ్ అన్నట్టుగా అంతా సింగిల్‌గానే డీల్ చేశాడు.
అందరినీ అప్రమత్తం చేశాడు. ప్రచారంలో నిరంతంగా, నిర్విరామంగా పాల్గొన్నాడు. 60 మంది అభ్యర్థులను ఎప్పటికప్పుడు టచ్‌లోఉంటూ ప్రచార కార్యక్రమల సరళిని పరిశీలిస్తూ.. సలహాలిస్తూ.. సూచనలు చేస్తూ..అన్నింటా తానై ఉన్నాడు. తానే అన్నై నడిపించాడు. ఎట్టకేలకు ఇందూరు బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేదాకా విశ్రమించ లేదు. మనం ఇంతకు ముందే అనుకున్నాం కాదా.. రచ్చ గెలిచాడు. ఇంటే గెలవాల్సి ఉందని. ఇప్పుడు ఇంటా గెలిచాడు. స్టేట్ లీడర్‌గా అందరి అభిమానాలు చూరగొన్న మహేశ్… తన సొంత గడ్డపైనా తన తడాఖా చూపించి.. శభాష్ అని తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. హ్యాట్యాఫ్ మహేశ్!

Dandugula Srinivas
Senior Journalist
7661066999
