వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌:

మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన 19వ డివిజ‌న్ కాంగ్రెస్ అభ్య‌ర్థి కాట్ప‌ల్లి శ‌మంత న‌రేంద‌రెడ్డి గురువారం కాల‌నీల్లో విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇంటింటికీ వెళ్లి ఓట‌డిగారు. మోడ‌ల్ డివిజ‌న్‌గా తీర్చిదిద్దుతాన‌ని, భారీ మెజారిటీతో గెలిపించుకోవాల‌ని అభ్య‌ర్థించారు. త‌మ ఇంటి ఆడ‌ప‌డుచులా ఆమెను సాద‌రంగా ఆహ్వానించారు. అక్కున చేర్చుకున్నారు కాల‌నీ వాసులు. కంఠేశ్వ‌ర్‌, గంగాస్థాన్‌తో పాటు ప‌లు కాల‌నీల్లో ఆమె ప‌ర్య‌టించారు. మేయ‌ర్ అభ్య‌ర్థి త‌మ డివిజ‌న్ నుంచి పోటీ చేయ‌డంతో అంతా ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకుని, డివిజ‌న్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తామ‌ని ఈ సంద‌ర్బంగా ఓట‌ర్లు అభ్య‌ర్థికి మాటిచ్చారు.