(దండుగుల శ్రీ‌నివాస్‌)

అలా దొరికిపోతుంటారిద్ద‌రు. ఒక‌రికి మించి మ‌రొక‌రు. ఓడినా ఇంకా అహంభావం మేం వీడ‌లేదంటూ నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇక మిమ్మ‌ల్ని బాగు చేయ‌టం ఎవ‌రి వ‌ల్లా కాదు. ఎందుకంటే మీకు మీరే దిగ‌జారిపోతున్నారు. పలుచ‌నైపోత‌న్నారు రోజు రోజుకీ ప్ర‌జ‌ల వ‌ద్ద‌. అసెంబ్లీ సెష‌న్ తొలిరోజే తండ్రీకొడుకుల అహంభావం ప్ర‌ద‌ర్శ‌న‌పై సోష‌ల్ మీడియా భ‌గ్గుమ‌న్న‌ది. ఇది కాంగ్రెస్‌కు క‌లిసి వ‌చ్చింది. పైగా సీఎం రేవంత్‌రెడ్డి స్వ‌యంగా కేసీఆర్ వ‌ద్ద‌కు వెళ్లి ఆత్మీయంగా ప‌లక‌రించ‌డం అధికారపార్టీకి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కేసీఆర్ ఇలా వ‌చ్చి అలా వెళ్లిన వైనంపై దుమ్మెత్తిపోయ‌డ‌మే కాదు.. వెట‌కారాలు, వ్యంగ్యాల‌తో సోస‌ల్ మీడియా ఆడుకుంది.

ఆ ఇద్ద‌రూ త‌మ అహంభావం వీడ‌క ఆ పార్టీని, లీడ‌ర్ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను మ‌రింత ఇబ్బందికి గురిచేయ‌గా.. సీఎం వ్య‌వ‌హ‌రించిన ధోర‌ణి కాంగ్రెస్ పార్టీకి మేలు చేసి ప్ల‌స్ అయింది. తొలిరోజు అసెంబ్లీ సెష‌ల్‌లో కాంగ్రెస్ పార్టీనే పైచేయిగా నిలిచింది. స్వ‌యంగా రేవంతు వ‌చ్చి మాజీ సీఎంను ప‌ల‌కించారు. ఎలా ఉన్నారు..? ఆరోగ్యం బాగుందా? అని అడిగారు. దీనికి ఆయ‌న న‌వ్వుతూ బాగుంద‌నే స‌మాధానం ఇచ్చారు. ఈ స‌మ‌యంలో అంతా లేచి నిల‌బ‌డ్డారు. కానీ కేటీఆర్ లేవ‌లేదు. స‌రే సీఎం అంటే ఎట్లాగూ నీకు లెక్క‌లేదు. మ‌రి మీ బాపు లేచి నిల‌బ‌డ్డాడు కదా.. ఆయ‌న‌కైనా మ‌ర్యాదివ్వాలి క‌దా? ఇవ్వ‌లేదు. దీనిపై మండిప‌డ్డారు నెటిజ‌న్లు. ఇంకా నీ అహంకారం పోలేదు కేటీఆర్‌.. నీ బలుపు చేష్ట‌ల‌తోనే పార్టీ ఇంత‌లా న‌ష్ట‌పోయింద‌ని తిట్టిపోశారు.

ఇక‌, బాపు తోలు తీస్తా.. తొక్క‌లో ఫ్యూచ‌ర్ సిటీ, కృష్ణా జ‌లాల నీటి వాటాలో ఎక్క‌డిదాకైనా పోరాడుతా… అని బీరాలు ప‌లికి.. అసెంబ్లీలో మాత్రం సంత‌కం పెట్టి తుర్రుమ‌న‌డంపై కూడా భ‌గ్గుమ‌న్న‌ది సోష‌ల్ మీడియా. దీనికేనా వ‌చ్చింది? అస‌లు వ‌చ్చుడెందుకు? పోవుడెందుకు? అని కేటీఆర్ తీరుపై మండిప‌డ్డారు. ఇంకా పెద్దాయ‌న మార‌లేదు… పార్టీ కూడా బాగుప‌డ‌దు.. అని శాపనార్థాలు పెట్టారు.

Dandugula Srinivas

Senior Journalist

7661066999