(దండుగుల శ్రీ‌నివాస్‌)

మొన్న‌టి వ‌ర‌కు ఆమె రాకుమారి! సీఎం బిడ్డెగా ఆమె ఏం చెప్పినా చెల్లింది. యువ‌రాణిలా వెలిగిపోయింది. కానీ పార్టీలో మెల్ల‌గా ఆమె ప్రతిష్ట మ‌స‌క‌బార్చే ప‌నికి పూనుకున్నాడు కేటీఆర్‌. పార్టీ ఓట‌మి పాలు కావ‌డం… తండ్రి ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం కావ‌డం.. అన్న‌కే అన్ని అధికారాలు అప్ప‌గించ‌డం.. చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. పార్టీ ఫండ్‌కు సంబంధించిన వేల కోట్లకు చెక్ ప‌వ‌ర్ కూడా అన్న‌కే ఇచ్చేశాడు కేసీఆర్‌. ఇక ఆమె ఆ పార్టీలో గుర్తింపు లేదు. ఆదాయం లేదు. ఉన్న దారులూ ముసుకుపోయాయి. అందుకే సొంతంగా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. త్వ‌ర‌లో కొత్త పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. అప్ప‌టి వ‌ర‌కు ఆమె జాగృతి వేదిక‌గా జ‌నంబాట కార్య‌క్ర‌మాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు స‌మ‌స్య క్యాష్ లేదు. ఆస్తులున్నాయి. ఆదాయం లేదు. మ‌రి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేదెలా? జ‌నం వ‌ద్ద‌కు వెళ్లాల‌న్నా … ఆమెతో మ‌మేకం కావాల‌న్నా.. కొన్ని నెల‌లు ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టుకోవాల్సింది. త‌న‌ను న‌మ్మి వ‌చ్చిన వారి, వెంట తిరుగుతున్న వారి ఖ‌ర్చులు భ‌రించాల్సిందే. మ‌రి పైస‌లెట్లా? అందుకే ఆమె అప్ప‌టి వ‌ర‌కు సంపాదించిన ఆస్తులు అమ్మేస్తున్న‌ది. కొన్ని కొన్నిగా. మెల్ల మెల్ల‌గా.

అంతా అనుకుంటారు ఆమెకు వేల కోట్ల ఆస్తులున్నాయి. కానీ అక్క‌డ అంత సీన్‌లేద‌ని ఆమె వెంట తిరిగే వారికి అర్థ‌మైపోయింది. సంపాదించిన ఆస్తులు అమ్మితే త‌ప్ప బండి న‌డిచేట‌ట్లు లేద‌ని. ఇప్పుడామె చేస్తుంద‌దే. తెర వెనుక అంతా అనుకుంటున్న‌దొక‌టి. వాస్త‌వంగా ప్రాక్టిక‌ల్‌గా అక్క‌డ జ‌రుగుతున్న‌దొక‌టి. చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారికి మాత్రం ఆ క‌ఠోర వాస్త‌వాలు తెలుస్తున్నాయి. నిజామాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో, హైద‌రాబాద్‌లో ఆమె పేరు చెప్పుకుని చాలా మంది బీఆరెస్ లీడ‌ర్లు ఆస్తులు కూడ‌బెట్టున్నారు. అందులో క‌విత వాటా కూడా ఉంద‌ని ప్ర‌చారం చేసుకున్నారు. క‌విత బినామీలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు అవ‌న్నీ బ‌య‌ట‌ప‌డ‌నున్నాయి. ఎందుకంటే… ఆమె ఆస్తులు ఎక్క‌డున్నా వాట‌న్నింటిపై క్లారిటీ రానుంది. ఉన్న ఆస్తులు అమ్ముకుంటే త‌ప్ప ఆమె మ‌ళ్లీ ఎన్నిక‌లొచ్చిదాకా జ‌నం ముందు నిల‌బ‌డ‌లేదు. పార్టీని న‌డ‌ప‌లేదు. వ‌చ్చే లీడ‌ర్ల‌ను ఆకర్షించ‌లేదు. అందుకే పైస‌లు కావాలె. అవి కావాలంటే పోగేసిన ఆస్తులు కరిగించాలె. ఇప్పుడామె చేస్తుంద‌దే.

Dandugula Srinivas

Senior jOURNALIST

7661066999