వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

వాళ్లు మార‌లేదు. మార‌రు. మ‌మ‌ల్ని ఓడ‌గొట్టి జ‌నాలు ఓ పేద్ద త‌ప్పు చేశారు.. అని వారి ఫీలింగు. అది జ‌నం గ్ర‌హించి బాంచ‌న్ మీరే కావాల‌ని మా ద‌గ్గ‌ర‌కి రావాల‌నే వారి దొర‌త‌నం ఆశ‌. అంచ‌నాలు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో ఏదోలా గెలిస్తే.. చూశారా.. జనం త‌మ త‌ప్పు తెలుసుకున్నారు..బుద్ది తెచ్చుకున్నారు. చెంప‌లేసుకున్నారు.. వాళ్ల‌కు సిగ్గొచ్చింది…అందుకే మ‌మ్మ‌ల్ని గెలిపించారు..అని చెప్పాల‌నుకుంటున్నారు. అదే మెసేజ్ ఇవ్వాల‌నుకుంటున్నారు. కేటీఆర్‌, కేసీఆర్ మాట‌లు చూస్తే ఇదే అర్థ‌మ‌వుతుంది అందరికి. వీరింకా మార‌లేదు. అహంకారం వీడ‌లేదు. మారిన‌ట్టు న‌టిస్తున్నారు. ప‌రివ‌ర్త‌న చెందిన‌ట్టు క‌నిపించే అహంకారులు అని జ‌నానికి అర్థం అయిపోయింది.

అందుకే వారింకా క్లారిటీతోనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నప‌ళంగా బీఆరెస్‌ను గెలిపిస్తే.. వారి అహంకారినికి మ‌రింత ఊత‌మిచ్చుతే త‌ప్ప‌… త‌ప్పులు తెలుసుకునే ప‌రిస్తితిని క్రియేట్ చేసిన‌ట్టు కాద‌నే విష‌యం కూడా జ‌నాల‌కు తెలుసు. అందుకే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం ఎన్ని డ్రామాలు ఆడినా.. చిత్తుగా ఓడించడం ద్వారా ఇంకా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పాలనుకుంటున్నారు జ‌నం.