వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
రాజకీయం కోసం దేనికైనా సిద్దమే అన్నట్టుగా ముందుకు సాగుతున్న కేటీఆర్‌కు మరో చెంపపెట్టు తీర్పు. యావత్ యువత భవిష్యత్‌నే పణంగా పెట్టి… వారి శ్రమని, చదువును అంగడి సరకుగా మార్చేలా కేటీఆర్ చేసిన కుట్రలు కకావిలకమయ్యాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ఇటు గ్రూప్-1 ఉద్యోగులు, వారి తల్లిదండ్రులకు కొత్త వెలుగులు తీసుకురాగా… వారి జీవితాలతో ఆడుకుని భవిష్యత్‌ను అంధకారం చేయాలనుకున్న కేటీఆర్ రాజకీయాలు తుత్తునియలయ్యాయి. హైకోర్టు తీర్పులో స్పష్టంగా చాలా విషయాలు వెల్లడయ్యాయి. లోపాలు, అక్రమాలు.. అనేవి కేవలం అనుమానాలేనని తేల్చిపారేసింది న్యాయస్థానం.
దీన్ని చిలువలు పలువలు చేసిన కేటీఆర్.. ఏకంగా తన రాజకీయ మైలేజీ కోసం గ్రూపు-1 అభ్యర్థులు ఒక్కొక్కరు కోటి రూపాయలు ఇచ్చారని చీప్ కామెంట్స్ చేసి వారిని మానసికంగా ఇబ్బంది పెట్టాడు. అవమాన పరిచాడు. వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేసింది. కంటనీరు పెట్టించిన కేటీఆర్‌కు వారి ఉసురు తగులుతుందనే శాపనార్ధాలు మిన్నంటాయి. అంతలా దిగజారి మరీ కామెంట్ చేయడం.. కేటీఆర్‌కు వ్యక్తిగతంగా, ఆ పార్టీకి కూడా తీవ్ర నష్టమే మిగిల్చింది. కేటీఆర్ తనకు తానుగా ఈ విషయంలో సెల్ఫ్ గోల్ అయ్యాడు. పిచ్చోడి చేతిలో రాయిలా మారింది కేటీఆర్ తీరు.
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం.. వర్కింగ్ ప్రెసిడెంట్ కాస్తా..అనధికార ప్రెసిడెంట్ అయిపోవడం.. ఏం చేయాలో ఏం చేస్తున్నాడో తెలియక.. ఇష్టారీతిన కామెంట్లు చేస్తూ.. ఆరోపణలు గుప్పిస్తూ రోజు రోజుకు మరింత పలుచనవుతున్నాడు జనం ముందు కేటీఆర్. ప్రత్యేకంగా గ్రూప్-1 ఉద్యోగాల విషయంలో కేటీఆర్ చర్యలు, మాట్లాడిన తీరు.. తీసుకున్న నిర్ణయాలు బ్లండర్ మిస్టేక్‌గా మిగిలిపోయాయి. ఇవి ఆ పార్టీని, ఆ లీడర్‌ను వెంటాడుతూనే ఉంటాయి. తన రాజకీయ మైలేజీ కోసం.. సర్కార్‌ను బద్నాం చేసే ఉద్దేశంలో కేటీఆర్ తీసుకున్నఅనాలోచిత నిర్ణయాలు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల ఉసురు తగిలేలా చేశాయి. ఇక బీఆరెస్ వారి నమ్మకాన్ని చూరగొనడం కల్లే. ఇంతలా అవమానపరిచి, మానసిక క్షోభకు గురిచేసిన కేటీఆర్‌ను, ఆ పార్టీని తెలంగాణ యువత ఎప్పటికీ క్షమించదు..!
