వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

ఆమె బీఆరెస్ కార్య‌క‌ర్తే. కేటీఆర్‌ను త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తుక్కు తుక్కు తిట్టింది. నువ్వో నీచుడ‌వంటూ దుమ్మెత్తిపోసింది. త‌న ప‌ట్ల అస‌భ్యంగా, అవ‌మానంగా ప్ర‌వ‌ర్తించిన ఒక‌డికి కేటీఆర్ వెన్నుద‌న్నుగా నిల‌వ‌డ‌మే ఆమె కోపానికి కార‌ణం. నువ్వింత నీచ‌డ‌వనుకోలేదు కేటీఆర్‌… పార్టీలోంచి వెళ్లిపోమ‌ని చెబితే పోతుంటిని క‌దా.. ఇంత‌గా అవ‌మానించాలా..? వాడికి అండ‌గా నిలిచావంటేనే తెలుస్తుంది.. ఆడ‌బిడ్డ‌ల‌పై నీ మ‌ర్యాద‌, గౌర‌వం ఏపాటివో.. అని తిట్ట‌డ‌మే కాదు.. ఇలా నీ బిడ్డ‌కు జ‌రిగితే నీకు తెలిసేది… ! అని ఘుటుగా స్పందించిందామె. ఆమె పేరు ఆశాప్రియ ముదిరాజ్‌.

దీనిపై సోషల్ మీడియాలో కేటీఆర్‌పై దాడి మొద‌లైంది. మొగ‌త‌నం గురించి మొన్న మాట్లాడిన కేటీఆర్ మాట‌ల‌ను కూడా ఈ సంద‌ర్బంగా ఉటంకిస్తున్నారు. మొగ‌త‌నం అంటే ఆడోళ్ల‌ను అగౌర‌వ‌ప‌ర్చ‌డం కాదు.. వారికి ర‌క్ష‌ణగా నిల‌బ‌డ‌టం, వారి మాన ప్రాణాల‌ను కాపాడ‌టం.. అంటూ హిత‌వు ప‌లుకుతున్నారు. ఇటీవ‌ల ఫ్రీ బ‌స్సు విష‌యంలో మ‌హిళ‌లు ఆ బ‌స్సుల్లో ఆట‌లాడుకుంటున్నార‌ని, డిస్కో డాన్సులు కూడా చేసుకోండి.. మాకేం అభ్యంత‌రం లేదంటూ నోరు జారాడు కేటీఆర్ ష‌రా మామూలుగా. త‌న‌కు అల‌వాటైన దోర‌ణిలో. దీనిపై మ‌హిళా లోకం భ‌గ్గుమ‌న్న‌ది. త‌ప్పు తెలుసుకుని చెంప‌లేసుకున్నాడు. టీన్యూస్ మ‌హిళా జ‌ర్న‌లిస్టు ఆత్మ‌హ‌త్య ఉదంతంలో నిందితుడికి స‌పోర్టుగా నిలిచిన బీఆరెస్ పార్టీ, కేటీఆర్‌.. ఉదంతాన్ని కూడా ఈ సంద‌ర్బంగా గుర్తు చేస్తున్నారు.

సొంత చెల్లెలు రాజ‌కీయంగా ఎదిగితేనే ఓర్వ‌లేక బ‌య‌ట‌కు పంపిప ఉదంతాన్ని గుర్తు చేస్తూ…. చెల్లెనే ఇలా చేశావంటే.. తెలంగాణ‌లో మిగిలిన ఆడ‌వారి ప‌రిస్థితి ఏంటీ..? అని ప్ర‌శ్నిస్తున్నారు. స్వ‌యంగా క‌వితే అన్న‌ది మొన్న ప్రెస్‌మీట్‌లో. త‌న‌పై పార్టీలో కుట్ర‌లు జ‌రుగుతున్నాయి…అని త‌ను తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా చెబితే కూడా ఒక్క‌సారి కూడా కేటీఆర్ ఫోన్‌లో కూడా ప‌ల‌క‌రించ‌లేద‌ని. ఆమె ఆవేద‌న వ‌ర్ణ‌నాతీతం. రాజ‌కీయాల కోసం ర‌క్త సంబంధాన్ని కూడా ప‌ట్టించుకోని కేటీఆర్ గురించి ఆ చెల్లే స్వ‌యంగా ప్ర‌పంచానికి వివ‌రించింది. త‌ను రాఖీ క‌ట్ట‌డానికి వ‌స్తున్నాని మెసేజ్ పెట్టినా నో రిప్లై. మీడియా ముందు కాకుండా, కెమెరాలు లేకుండా రాఖీ క‌ట్టి పోతాను అని బ‌తిమాలుకున్నా నో రిప్లై.. నో రెస్పాన్స్‌! ఎక్క‌డ ఇంటికి వ‌స్తుందోన‌ని ఆద‌రాబాద‌రా త‌న‌కు ప‌ని ఉంద‌ని ఢిల్లీకో బెంగ‌ళూరుకో జంప్ అయిపోయాడు ఈ అమ‌ర్యాద రామ‌న్న‌. ఓ జ‌ర్న‌లిస్టు ఓ మ‌హిళ‌ను మోస‌గించిన ఉదంతంలో కూడా ఆ జ‌ర్న‌లిస్టుల‌కు స్వ‌యంగా త‌నే బెయిల్ ఇప్పించి మ‌రీ బాజాప్తా త‌నే ఇప్పించాన‌ని అత‌గాడికి స‌ర్టిఫికెట్ ఇప్పించి మ‌రీ గొప్ప‌లు చెప్పుకున్నాడు మ‌న రామ‌న్న‌.

You missed