అప్పుడు రాని ఉప ఎన్నికలు.. ఇప్పుడొస్తాయా? పార్టీ ఫిరాయింపులపై దొంగే దొంగన్నట్టుగా..! సుప్రీంతీర్పు పై బీఆరెస్ మేకపోతు గాంభీర్యం. జనాల నుంచి ఆ పార్టీకి మద్దతు కరువు.. సోషల్ మీడియాలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులపై నిలదీతలు
(దండుగుల శ్రీనివాస్) ఫక్తు రాజకీయం పాలనలో ప్రశ్నించేవాడుండొద్దు. అసెంబ్లీలో తను చెప్పింది గంటల తరబడి అలాగే విని తరించాలి. ఎదురు మాట్లాడొద్దు. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. అంతా తెలంగాణ జాతి పిత అని పిలవాలె. తనే తెలంగాణ. తెలంగాణే తను అని…
