(దండుగుల శ్రీనివాస్)
రేవంత్‌రెడ్డి అంటే అంతే. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలె. అదే పాలసీని ఆది నుంచి అమలు చేస్తున్నాడాయన. కేసీఆర్‌లా తను తప్పిదాలు చేయొద్దనుకున్నారు. అందుకే అతి ఉత్సాహంతో ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే అక్కడే వారి తోకలు కట్ చేసి పారేస్తున్నారు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. గణపతి ఉత్సవాల్లో ఓ నేత ఉత్సాహం చూపించాడు. రేవంత్‌రెడ్డి మెప్పు పొందాలనుకున్నాడు. అతి వినయం దూర్త లక్షణం అనే విషయం మరిచాడు. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని పోలిన గణనాథుని విగ్రహ ప్రతిమను తెచ్చి పెట్టాడు.
ఇది నెట్టింట వైరల్ అయ్యింది. మీ భక్తి పాడుగాను.. భజనలు చేయండి.. బాగానే ఉంది… చివరి రోజు మాత్రం నిమజ్జనం చేయాల్సి ఉంటుందిరోయ్…! అని అసలు విషయాన్ని ఇట్లా బట్టబయలు చేసే సరికి.. ఇది సీఎంవో దాకా పోయింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు రేవంత్. వెంటనే ఆ విగ్రహాన్ని చేంజ్ చేయాల్సిందిగా సదరు భక్తజన మండలిని ఆదేశించడంతో .. డ్యామిట్ కథ అడ్డం తిరిగిందని ఉరుకులు, పరుగుల మీద రేవంత్ గణనాథుడు మాయమయి.. మన గణనాథుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదీ సంగతి. గతంలో కూడా ఓ కాంగ్రెస్ నేత ఓ పేపర్ పెట్టాడు. అది ఏకంగా రేవంత్‌రెడ్డే పెట్టించారనే ప్రచారం సోషల్ మీడియాలో సాగింది. వెంటనే సీఎం టీమ్ రంగంలోకి దిగింది.
అది వెంటనే ఆపేయాలనే విధంగా ఆదేశాలూ జారీ అయ్యాయి. కేసీఆర్ నమస్తే తెలంగాణ పెట్టి లాభం పొందడం అటుంచి పూర్తిగా బద్నాం అయ్యాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాంగ్రెస్ సర్కార్‌కు రావొద్దనేది రేవంత్ ఆలోచన. సరే.. ఆ పేపర్ ఓనర్ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిలా కాకుండా.. న్యూట్రల్‌గా వార్తలు రాసుకుంటూ సైలెంట్‌గా ఉంటు తనపనేదో తను చేసుకుంటున్నాడు. జర్నలిస్టులతో ప్రవర్తన విషయంలోనూ రేవంత్ .. కేసీఆర్‌కు భిన్నంగా ఉంటున్నారు. కేసీఆర్ చేసిన తప్పిదాలు తను చేయకపోవడమే అందరి మెప్పు పొందే సూత్రమని నమ్ముతున్నారు. అందుకే ఇలాంటి అత్యుత్సాహపు చేష్టలు, సంఘటనలు ఏవైనా సంభవిస్తే వెంటనే ఇలా రియాక్టవుతున్నారన్నమాట.
Dandugula Srinivas
Senior journalist
8096677451