(దండుగుల శ్రీనివాస్)
ఇంతోటి దానికి ఇక్కడిదాకా రావాలా..? పట్టుమని పదినిమిషాలు లేని ప్రసంగం కోసం పనిగట్టుకుని ఇందూరు దాకా పోవాలా..? అంటే బలవంతంగా రప్పించారు. ఆయన వచ్చాడు. వెళ్లాడు. ప్రసంగించాడు. కేవలం పసుపు…పసుపు..పసుపు.. అంతే..! ఆపై ఏమీ లేదు. కొండంత రాగం తీసి… అన్నట్టుగా అమిత్ షాను ఇందూరుకు రప్పిస్తున్నాం.. ఇక బీజేపికి ఇది మరింత బూస్టింగ్ ఇస్తుందని అంతా అనుకున్నారు. అంచనాలు మించిపోయాయి.
కానీ అమిత్ ప్రసంగం తుస్సుమనిపించింది. తుస్సుమంటే తుస్సే… అంతకుమించి పెద్దగా అక్కడ ఏమీ లేదు. దీని కోసం ఏర్పాట్లు.. జన సమీకరణ.. ప్రజలను ఇబ్బంది పెట్టడం.. ఆదివారం దందా పూరా లాస్.. అంతా అయ్యాయి. అమిత్ షా ప్రసంగం కొత్తగా ఏమీ లేదు. అంతా స్రిప్టెడ్ ప్రసంగం. రొటీన్ రొడ్డ కొట్టుడు.. బోరింగ్‌కే బోరింగ్ తెప్పించే ప్రసంగం. అంతకు మించి చెప్పడానికేం లేదు.