(దండుగుల శ్రీనివాస్)
పొంగులేటి శ్రీనివాస్‌కు కొంత దూకుడెక్కువ. పగ, ప్రతీకారాల పాలూ ఎక్కువే. సహజంగా తనది ఖమ్మం కావడం, జగన్‌తో దోస్తానా కూడా కొంత ప్రభావం చూపడమేమో.. పైకి కామ్‌గా కనిపించినా.. లోపల కొంత ఫ్యాక్షన్ రాజకీయాల్లాంటి వుంటాయి. కేసీఆర్, కేటీఆర్ అంటే అగ్గి పగ. తనను అవమానించారనే కసి ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
అదృష్టం కొద్దీ ప్రభుత్వం ఏర్పడింది. కీలకమైన మంత్రి పదవి దక్కింది. అంతో ఇంతో ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. సీఎం రేవంత్ తరువాత నేనే అనే రేంజ్‌లో నడిపించుకుంటున్నాడు. తన శాఖలో ఎవరు వేలు పెట్టినా ఊకోడు. చివరకు సీఎం చెప్పినా వినడు. ఆ ఫైలు మూవ్ కాదు. అలా నెంబర్ 2గా చెలామణి అవుతున్నాడు. అంతర్గతంగా చర్చించిన విషయాలు మీడియాకు చెప్పి హైలెట్ కావడం అలవాటు. వార్తల్లో నిలవడం ఇష్టం. దీపావళికి ముందే బాంబులు పేలుతాయనే అత్యుత్సాహపు ప్రకటన ఇలా వచ్చిందే. దీనిపై సీఎం రేవంత్.. విలేకరుల సమావేశంలోనే తన అసహనాన్ని ప్రదర్శించాడు. పరోక్షంగా అప్పుడే పొంగులేటి గాలి తీసేసినంత పనిచేశాడు. కానీ మారలేదు.
డోంట్ కేర్ అన్నాడు. సహజంగానే తనకున్న లక్షణం అది. దీనికి తోడు అధికారం. ఆపై డబ్బు. ఇక తనకు దూకుడుకు తిరుగేలేదు. కానీ ఇలా ఇప్పుడు రేవంత్ ఆ దూకుడుకు కళ్లెం వేస్తున్నాడు. పీసీసీ చీఫ్‌తో చివాట్లు పెట్టిస్తున్నాడు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు.. అంతే.. ! ఇప్పుడిది వార్నింగ్‌తో మొదలైంది. ఇంకా ఇంకా వీరి మధ్య గ్యాప్ బాగానే బయటకు వస్తుంది. రచ్చ రచ్చ కావడం కాంగ్రెస్‌లో సహజం. నువ్వు గొప్పా నేను గొప్పా.. ఇదే ఈగో ఫీలింగ్.. పై చేయి నాదంటే నాదనే ధోరణి … గ్రూపులను మరింత పెంచి పోషించే పరిస్థితులు లేకపోలేదు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451