(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఖుషీ సినిమాలో భూమిక త‌న తండ్రి విజ‌య్‌కుమార్‌తో అంటుంది. మీదో పెద్ద క‌లెక్ట‌ర్ సంత‌కం మ‌రి.. ఏదో కోడికెలికిన‌ట్టు ఉండే ఓ సంత‌క‌మేగా.. నేనే పెట్టేశా..! అని. అట్ల‌నే ఉంది క‌విత హ్యాండ్ రైటింగ్ కూడా. మంచిగా ముద్దుగా ఏదైనా లెట‌ర్ ప్యాడ్‌పై టైప్ చేసి కింద ఓ సంత‌కం పెడితే స‌రిపోయేది. ఆమె స్వ‌ద‌స్తూరితో రాసింది. రాస్తే రాసింది. మొత్తం తెలుగు కాదు. మొత్తం ఇంగ్లీష్ కాదు. మ బ‌దులు యా అనే అక్ష‌ర‌మే వాడింది. ఇంగ్లీష్ మీడియం వాళ్లు ఇంతేలే. ఇప్ప‌టికీ నేటిత‌రం పిల్ల‌ల‌కు మా కు యా కు తేడా తెల్వ‌దు. మా బ‌దులుగా యా రాసేస్తారు. దాని అర్థ‌మే మారిపోతుంది. స‌రే కోడిగుడ్డు మీద ఈక‌లు పీకిన‌ట్టు ఇదో వార్తా అంటారా..?

Kavitha_Letter

ఇంకో ముచ్చ‌ట‌. ఇది ఆమే రాసిందా..? ఎందుకు చేతిరాత‌తో రాసింది…? ఎవ‌రు లీక్ చేశారు..? కొత్త పార్టీ పెడుతుంద‌నే ప్ర‌చారం లో భాగంగా కాంగ్రెస్ చేసిందా..? అని ఒక‌రు. అమెరికా నుంచి రానీ బిడ్డ మీ సంగ‌తి చూస్త‌ద‌ని ఇంకొక‌డు.ఆమే రాసి ఉండ‌క‌పోతే… ఇప్ప‌టికే మీడియాలో ర‌చ్చ రంబోలా అయితే ఎందుకు క‌నీసం స్పంద‌న లేదు. చిన్న విష‌యాల‌కే వెంట‌నే స్పందించే క‌విత డియ‌ర్ డ్యాడీ అంటూ ఐదు పేజీల త‌న చేతుల‌తో రాసిన లేఖ‌ను ఖండించే ఓ ప్ర‌క‌ట‌న రాక‌పోయేదా..? ట్విట్ట‌ర్ గూట్లో కూసే అల‌వాటుండి.. ఎక్క‌డ ఏది జ‌రిగినా ఓ సందేశం పంపే అల‌వాటుండీ… ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యింది.

త‌న రాజ‌కీయ అస్తిత్వానికే ప్ర‌మాదంగా మారిన పరిస్థితులు ఆమె క‌ళ్ల‌ముందున్నాయి. ఇక త‌ప్ప‌లేదు. త‌ప్ప‌డం లేదు. అధికారం కావాలె. డ‌బ్బుల‌కు కొద‌వ‌లేదు. ప‌వ‌ర్‌లేని మ‌నీ ఎందుకు..? నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నే కుట్ట‌నా ..? అన్నట్టుగానే పోతున్న‌ది క‌విత‌. అందులో డౌటేమీ లేదు. ఆమె వెంట వ‌చ్చేదెవ‌రు..? నిల‌చేదెవ‌రు..? ఇవ‌న్నీ త‌రువాత సంగ‌తులు. క‌విత నోటి వెంట ప‌చ్చి నిజాలు ఇలాగైనా బ‌య‌ట‌పుడున్నాయి.. లేఖ మంచిదే అంటున్నారు క‌రుడుగ‌ట్టిన ఉద్య‌మ‌కారులు, ఇంకా పార్టీనే ప‌ట్టుకుని వేలాడుతున్న అభిమానులు.

ఓ వైపు వ‌ర్షాలు ప‌డి రైతులంతా ఆగ‌మైతుంటే.. మీరు మీ లేఖ‌లు.. మీ రాజ‌కీయాలు.. మీ కోడిగుడ్డు మీద ఈక‌లు పీకుడు.. థూ జ‌ర ఆపండ్రా భ‌య్‌.. ! జ‌ర రైతుల గోస చూడుండ్రి.. వాళ్ల బాధ‌లు రాయుండ్రి. స‌ర్కార్‌కు చీమ కుట్టిన‌ట్టైనా లేదు. ఈ రాజ‌కీయాల కంపులో అది చ‌లికాచుకుంటున్న‌ది. పిల్లికి చెల‌గాటం ఎల‌క‌కు ప్రాణ సంక‌టంలా ఉంది… అగో మ‌రెవ‌రు తిడుతున్నారు. జ‌ర అది కూడా కొంచెం రాద్దామా మ‌రి.

You missed