(దండుగుల శ్రీనివాస్)
సీపీఆర్వోగా శ్రీరామ్ కర్రికి బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. బోరెడ్డి అయోధ్యరెడ్డిని ఆర్టీఐ కమిషనర్‌గా నియమించిన నేపథ్యంలో సీపీఆర్వోగా ఎవరిని నియమిస్తారనే చర్చ జోరందుకున్నది. కీలకమైన ఈ బాధ్యతలను సీఎం రేవంత్‌రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీరామ్ కర్రిని ఇవ్వనున్నట్టు మీడియా సర్కిళ్లలో ప్రచారం జరుగుతున్నది.
మీడియాను సమర్థవంతంగా హ్యాండిల్ చేసి అందరితో సత్సంబంధాలు నెరిపే శ్రీరామ్ కర్రికి ఈ బాధ్యతలు ఇస్తే ప్రభుత్వ కార్యక్రమాలు మరింతగా జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.