(దండుగుల శ్రీ‌నివాస్‌)

హైడ్రా నా నీ బొంద‌నా..? బాగానే ఉంది పంచ్‌. హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి పేద‌ల ఇళ్ల‌ను కూల్చేసి వారి ఉసురు తీసుకున్నాడ‌నే రేంజ్‌లో కేసీఆర్ భ‌గ్గుమ‌న్నాడు. ఇంత వర‌కు బాగానే ఉంది. ఆ త‌రువాత దీనికి కొన‌సాగింపుగా చేసిన ప్ర‌సంగం… అబ‌ద్దాలు, అహంకార‌దోర‌ణి ఈ రెండూ ఇంకా కేసీఆర్‌ను వీడ‌లేద‌ని తేల్చాయి. మొద‌టిది అబ‌ద్దం విష‌యం మాట్లాడుకుందాం. తాను క‌ట్టించిన ఇండ్ల‌ను రేవంత్ కూల్చాడ‌న‌డం. పేద‌ల‌కు ఎంతో మంది ఇళ్ల‌ను క‌ట్టిస్తే సీఎం కూల్చేశాడ‌ని కేసీఆర్ అన్నాడు. కానీ కేసీఆర్ పేద‌ల‌కు ఎన్ని ఇండ్లు క‌ట్టించాడు.

28Vastavam.in (3)

కేసీఆర్ పాల‌న‌లో అత్యంత అట్ట‌ర్ ఫ్లాప్ అయిన ప‌థ‌కం డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల స్కీం. అవి ఎవ‌రికీ దరి చేర‌లేవు. ఈ ప‌థ‌కమే న‌డిసంద్రంలో మునిగిపోయింది. ఇక పేదోడిని ఆదుకున్న‌దెక్క‌డ‌..? నీడ‌నిచ్చిందెక్క‌డ‌..?? ఇది శుధ్ద అబద్దం. ఇక ఈ హైడ్రా వ‌ల్ల ఓ బాధితుడు అన్నాడ‌ట‌.. కేసీఆర్ అన్నా నువ్వు రావాలి..? మ‌మ్మ‌ల్ని ఆదుకోవాలి…! అని.

తిలా పాపం… త‌లా ఓ డైరీ…!

నేనెట్లా వ‌స్త బై. క‌త్తి నాకియ్య‌లే క‌దా. క‌త్తి ఒక‌నికిచ్చి యుద్దం ఒక‌న్ని చేయ‌మంట‌వా..? ఇగో మ‌ళ్లీ అవే మాటలు. క‌త్తి నీకియ్య‌క‌పోతే న‌డిరోడ్డున వాని జీవితం ఆగ‌మైనా క‌ళ్లారా చూస్తూ ఉంట‌వా.? వాడి ఆర్త‌నాదాలు వీనుల‌కు విందుగా అనిపిస్తున్నాయా..? అనుభ‌వించిండ్రు నా కొడుకుల్లారా అని పైశాచికానందం పొందుతావా..? అట్ల‌నే ఉంది కేసీఆర్ మాట‌ల తీరు. వ్య‌వ‌హారం. పోయిన చోటే వెతుక్కోవాల‌న్నాడు. అప్ప‌టిదాకా స‌మ‌యం ఉంది క‌దా. పోరాడు. మ‌ద్ద‌తుగా నిల‌బ‌డు. వారికి అండ‌గా ఉండు. క‌త్తియ్య లేద‌ని ఫాం హౌంజ్‌లో పంట‌నంటే ఎట్ల‌నే క‌త్తి కాంతారావు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed