(దండుగుల శ్రీనివాస్)
రాములమ్మను అంతా మరిచిపోయారు. ఆమె ఎన్నికల సమయంలోనే ప్రచారంలో కనిపించింది. ఆమెకు వాగ్దాటి కూడా లేదు. ఒక్కోసారి ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. సబ్జెక్టు నిల్. అలాంటి రాములమ్మ పేరు అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పేర్లలో వచ్చి చేరింది. దీనికి కారణం రాహుల్‌గాంధీ. అప్పుడు పనిచేసినందుకు ఇప్పడిలా అవకాశం ఇచ్చి ఉంటాడు. కానీ కాంగ్రెస్ శ్రేణులే కాదు.. సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఆమె ఎంపికపై. అద్దంకి దయాకర్‌కు ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే రాములమ్మకు ఇచ్చి ఇజ్జత్ తీసుకున్నారనే విధంగా సోషల్ మీడియాలో కామెంట్లు, విసర్లు వస్తున్నాయి.
ఇప్పుడు కొత్తగా ఆమె రాక మూలంగా, ఆమెకు పదవి దక్కడం కారణంగా కాంగ్రెస్‌కు నయాపైసా లాభం లేదనే విధంగా కూడా కాంగ్రెస్ అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కొందరు తమ మనోగతాన్ని పంచుకుంటున్నారు. ఎంతో మంది ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. సహజంగానే కాంగ్రెస్‌లో తాకిడి ఎక్కువగానే ఉంటుంది. పోటీ విపరీతమే. కానీ ఎవ్వరూ ఊహించని పేరు రాములమ్మది కావడంతో అంతా నోరెళ్లబెట్టారు. కొందరైతే మహిళా రిజర్వేషన్‌లను ఇలా కాంగ్రెస్ అమలు చేస్తుందన్నమాట. మంచిదే కదా. అని కూడా సమర్థిస్తున్నారు. మొత్తానికి రేవంత్‌తో సంబంధం లేకుండానే పేర్లు, పదవువులు ఇలా వచ్చి పడతున్నాయన్నమాట.
ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి రేవంత్ ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకుంటున్నాడనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. కానీ అది చెల్లుబాటు కాలేదు. రేవంత్ మాట వినే స్థితిలో అధిష్టానం లేదు. అందుకే అనుకోని పేర్లు ఇలా రాములమ్మ రూపంలో వచ్చి పడుతున్నాయి. రాహుల్ ఆదేశించాడు. మీనాక్షి పాటించింది. రాములమ్మ వచ్చి చేరింది. అంతే..! రేపు మంత్రివర్గ విస్తరణలో కూడా ఎన్ని జిమ్మిక్కులు, ట్విస్టులు ఉండబోతున్నాయో. ఢిల్లీ నుంచి ఆదేశాలు.. ఇక్కడ నటరాజన్ చేతిలో రిమోట్ … రేవంత్ దానికితగ్గట్టుగా నడవాలి. ఆడాలి. నటించాలి. జీవించాలి. దటీజ్ కాంగ్రెస్ పార్టీ.