(Dandugula Srinivas)

దూకుడు సినిమాలో డైలాగ్‌లానే సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చాడు కిష‌న్‌రెడ్డికి. విల‌నీల‌ను చావ‌చిత‌క్కొట్టే స‌మ‌యంలో హీరో మ‌హేశ్‌బాబు వాడిన డైలాగు గుర్తుంది క‌దా. నువ్వు ధ‌మ్కీ ఇస్తే ద‌డుసుకోనికి తూతుంబ‌ర్‌గాడిన‌నుకున్నావ్‌… పోలీస్‌….! అంటాడు. ఒక్క పోలీస్ అనే మాట త‌ప్ప సేమ్ టు సేమ్ డైలాగ్‌. అక్క‌డ పోలీస్‌.. ఇక్క‌డ రేవంత్ అంతే తేడా. కిష‌న్‌రెడ్డిని ఇలా అర్సుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. బాగానే క‌డిగేశాడు. మొన్న‌టి వ‌ర‌కు కేసీఆర్‌, కేటీఆర్‌. తాజాగా గాంధీభ‌వ‌న్‌లో మాట్లాడిన ప్రెస్ మీట్‌లో కిష‌న్‌రెడ్డిపై ఫైర్ అయ్యాడు. ప‌నిలో ప‌నిగా చెల్లె కవిత మీద సెటైర్లు వేశాడు. ప‌దే ప‌దే ఢిల్లీకి వెళ్లేది లిక్క‌ర్ దందా కోసం కాద‌న్నాడు. మ‌రెంతేగా. రేవంతుతో పెట్టుకుంటే. మినిమం అట్లుంట‌ద‌న్న‌మాట‌. ఆమె ప్రెస్ మీట్ పెట్టి ప‌దంటే. ఈయ‌న ఒక్క‌టే అన్న‌డు. చెల్లెకు చెల్లుకు చెల్లు. ఇంకా ఏమ‌న్నాడో చ‌దువుదాం…

01Vastavam.in (1)
మోదీ గుజరాత్ నుంచి రైళ్లల్లో నోట్ల కట్టలు పంపిస్తున్నట్లు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు…మేం మోదీ ఆస్తులనో, కిషన్ రెడ్డి ఆస్తులనో అడగడం లేదు …రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటినే కేంద్రాన్ని అడుగుతున్నాం… నువ్వు అడ్డుపడటం వల్లే మెట్రో ఆగింది …వందశాతం సైంధవ పాత్ర పోషిస్తున్నావు… అని విరుచుకుప‌డ్డాడాయ‌న‌.

ఎందుకు మెట్రోను కేంద్రమంత్రివర్గ ఎజెండాలో పెట్టడంలేదు?… ఎజెండాలో పెట్టొద్దని మంత్రివర్గంపై ఒత్తిడి తెస్తోంది ఎవరు? ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రాజెక్టు ఏమైనా తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలి….మీరు బెదిరిస్తే భయపడటానికి ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు …మేం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులే అడుగుతున్నాం …కిషన్ రెడ్డి ఒక్కరోజైనా మోడీ దగ్గర తెలంగాణ రాష్ట్రానికి కావలసినవి ఏమైనా అడిగారా?

ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడిలా కిష‌న్ రెడ్డిపై.

బిజెపి కూటమి అధికారంలో ఉన్న పక్కరాష్ట్రంలో ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు… బీజేపీ అధికారంలో ఉన్న బీహార్ , యూపీ లాంటి రాష్ట్రంలో ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు ….అక్కడ ఎందుకు రద్దు చేయించడంలేదు.. ఏపీలో మీ ప్రభుత్వంలో ఉన్నా ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయడంలేదు … కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకనే కులగణనపై విమర్శలు చేస్తున్నారు.. తమిళనాడుకు మెట్రోకు అనుమతిస్తారు కానీ తెలంగాణకు ఎందుకివ్వరు ….కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రోకు అనుమతులు ఇవ్వడంలేదు …. అని మ‌రోసారి అవే మాట‌లు, అవే విమ‌ర్శ‌లు చేశాడు రేవంత్‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *