(దండుగుల శ్రీనివాస్)
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడంతా సీనియర్ ఐఏఎస్‌లు పాల్గొన్నారు. ఇదే వేదికగా వారందరినీ ఉద్దేశించి, తెలంగాణలోని ప్రస్తుత ఐఏఎస్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన హితబోధ చేశారు. ఓ రకంగా నారాజ్ అయ్యారు. గుస్సా ప్రదర్శించారు. ఐఏఎస్‌ల తీరుపై పెదవి విరిచారు. ఆయన మాటలు ప్రస్తుత పరిపాలనకు అద్దం పడుతున్నాయి. సీఎం చెబితే ఐఏఎస్‌లు వినడం లేదా..? ఆయన అదే ప్రష్టేషన్‌లో మాట్లాడారా..? ఐఏఎస్‌ల విషయంలో రేవంత్ ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయారా..? సీఎం ఈ వేదికగా మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది.
ఓ రకంగా కొందరి ఐఏఎస్‌లను దృష్టిలో పెట్టుకుని ఆయన లీడర్లకంటే వారే పెద్ద అవినీతి పరులుగా అభివర్ణించారు. ఒక్కతప్పు చేయమంటే మూడు తప్పులు చేసేందుకు రెడీ అవుతున్నారని ఆయన అనడం గత ప్రభుత్వంలో వారు ఎలా తయారయ్యోరో చెప్పే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు సర్కార్‌లకు సూచనలు చేసేది. కానీ ఇప్పుడు అవినీతికి పాల్పడే విషయంలో సర్కార్‌లతో పాటు నడిచేందుకు రెడీ అంటున్నారని, ఎలా అవినీతికి పాల్పడాలో అక్రమార్గాలు తొక్కాలో సూచిస్తున్నారని సీఎం అనడం కలకలం రేపింది. ఆయన మాటల ఉద్దేశం.. ఐఏఎస్‌ల వ్యవస్థ ఎలాగుందో తెలియజెప్పింది.
మరెందుకు అలా వారు తయారయ్యారు…? మాజీ సీఎం కేసీఆర్‌కు ఇది తెల్వదా..? తెలిసి వారిని పెంచిపోషించాడా..? ఇంకా వారిని అవినీతి పరులను చేశాడనే ఉద్దేశంతో సీఎం ఇలా పరోక్షంగా అన్నాడా..? అనే అంశాలు ఇప్పుడు డిస్కషన్‌కు వస్తున్నాయి. ఏసీ రూములను కలెక్టర్లు వదలడం లేదన్నారు. ఇది మారాలని హితవు పలికారు. కొందరు ఫైళ్లు పంపినా సంతకాలు చేయకుండా నెగిటివ్ దృష్టితో కామెంట్లు పెట్టుకుంటూ పెండింగ్‌లో పెట్టేస్తున్నారని గుస్సా ప్రదర్శించారు. వాస్తవంగా సీఎం ఏదో చేయాలనుకన్నా రియాటికి వస్తే ఇక్కడ అంత సీన్‌లేదు. కావాల్సినంతగా ఐఏఎస్‌లు లేరు. కేంద్రం చేతిలోని పని. ఉన్నవారికే మూడు మూడు శాఖలు ఇవ్వాల్సిన దుస్థితి. ఉన్నవారితోనే సరిపెట్టుకునే దీనస్తితి. ఒక్కో సమయంలో సీఎం చెప్పినా అక్కడ పనులు కావు. కొందరు వినరు. అదంతే. చట్టాలనికి లోబడే పనిచేస్తాం.. సీఎం చెబితే చేయాలా..? అనే వారూ ఉన్నారు. ఇలాంటి సందర్బాలే బహుశా రేవంత్‌కు చికాకు తెప్పించి ఉంటాయి. అందుకే ఈ వేదికగా మీద ఐఏఎస్‌లను చెడామడా అర్సుకున్నారు. మారండని హితవు కూడా పలికారు. ఏకంగా రేవంతే ఇలా అంటే ఇక మిగిలిన మంత్రుల బ్యాచు ఐఏఎస్‌లను పట్టించుకుంటుందా..? నోటి దురుసు ఇంకా పెంచేయదు…! ఇది పాలనకు, పాలకులకు మధ్య అంతరం పెంచదా..? అదే జరుగుతుంది..!
వాస్తవానికి ధరణి పేరుతో కొందరు కలెక్టర్లు కోట్లు గడించారు. ఇది మేం చెబుతున్నది కాదు. రెవెన్యూ శాఖనే కోడై కోసింది. కేసీఆర్ తెచ్చిన ధరణి లోని లొసుగులు, లోపాలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు చాలా మంది. అంతా కలెక్టర్ల చేతికి తాళాలిచ్చిన కేసీఆర్ .. వారిని దోచుకోండనే విధంగానే ప్రోత్సహించాడు. ధరణితో కోట్లు కొల్లగొట్టారు. లీడర్లు, ఐఏఎస్‌లు తోడుదొంగలయ్యారు. సీఎం కాళ్లు మొక్కేందుకు కూడా దిగజారారు. జిల్లాలు పెంచడం. ఐఏఎస్‌ల కొరత, ఉన్నవారిని కలుషితం చేయడంలో గత పాలన సక్సెసయ్యింది. ఇప్పుడు వారే కీలక పదవుల్లో కొనసాగతున్నా రేవంత్ కూడా ఏమీ చేయలేని దుస్తితికి పరిస్థితి వచ్చింది. సీసీఎల్ఏ ను శాసించిన ఐఏఎస్సే ఇప్పటికీ అదే స్థానంలో ఉన్నాడు. మరి రేవంత్ మార్చడెందుకు.? వారికున్న బలహీనతలు వారికున్నాయి. అందుకే చెప్పేందుకే సద్దులు.. అందరికీ అదే దారి. రేవంత్ ఎన్ని నీతులు చెప్పినా.. చేస్తుంది కేసీఆర్‌లాగే. కేసీఆర్ పాలన మాదిరిగానే.