చికెన్ ప్రియులకు !
చికెన్ కొనండి.
చేతికి గ్లోవ్స్ వేసుకొని దాన్ని కట్ చేయండి.
గ్లోవ్స్ తోనే చికెన్ ముక్కలు తీసి గిన్నె లేదా పెనం పై పెట్టి ఉడికించండి ( లేదా ఫ్రై ) . మీరు చికెన్ ఎలా చేసేవారో అలాగే – తేడా ఏమీ లేదు.
గ్లోవ్స్ లేక పొతే చికెన్ కట్ చేసాక చేతులను సబ్బు తో బాగా శుభ్రంగా కడుక్కోండి.
తేడా ఒక్కటే పచ్చి చికెన్ లో వైరస్ ఉందనుకొని చేతులు శుభ్రం చేసుకోవడమే.
నూనె లేదా నీటి వేడికి ఎలాగూ వైరస్ చస్తుంది.
చేయాల్సిందల్లా ఒక్కటే.
చికెన్ కట్ చేసిన చేతులతో మరో ఆహారపదార్థం ముట్టుకోక పోవడం.
సబ్బు నీటి తో చేతులు కడుక్కొంటే చేతుల్లోని వైరస్ చస్తుంది.
ఉడికించిన వేడికి పెనం లోని చికెన్ లో వైరస్ చస్తుంది.
అజ్ఞానం తో “ వామ్మో “ అని బూటకపు ప్రచారం చేశారు. దెబ్బకు చికెన్ రేట్లు పడిపోయాయి.
చికెన్ తినడానికి ఇదే మంచి సమయం.
( చికెన్ కట్ చేస్తున్నప్పుడు చేతితో నోటిని ముక్కును కళ్ళను తాకొద్దు. వెంటనే సబ్బుతో శుభ్రం చేసుకోండి. గ్లోవ్స్ ను ఉపయోగిస్తే దాన్ని చెత్తబుట్టలో పడేయండి. గ్లోవ్స్ వాడినా చేతులో సబ్బుతో కడుక్కోండి. అప్పటిదాకా ఇతర ఆహార పదార్థాలు తాకకండి. )
Amarnath Vasireddy