Dandugula Srinivas
8096677451
స్థానిక సంస్థల ఎన్నికలంటే భయం పట్టుకున్నది సర్కార్‌కు. జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. మొన్న నాలుగు పథకాలు ఏదో ప్రారంభించామని చెప్పుకున్నా అవి అందరికీ దరి చేరే వరకు చాలా సమయం పడుతుంది. ఆలోపు ఎన్నికలొచ్చినా.. అవి అందాకా ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపేలా లేరు.
అయితే బీఆరెస్. లేదంటే బీజేపీ. ఈ పరిస్తితి గమనించాడు రేవంత్. అందుకే నయానో భయానో ఎలాగైనా సరే స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు చేయాలన్నాడు. ఈ బాధ్యత ఎమ్మెల్యేలపై పెట్టాడు. అంటే అర్థం ఎవరైతే పోటీలో నిలుస్తారో.. మిగిలిన వారికి నచ్చజెప్పాలి. వారికి ఆర్థికంగా సపోర్టు చేయాలి. కాంట్రాక్టు పనులియ్యాలి. ఫైరవీలు చేసి పెట్టాలి. వారి డిమాండ్లు తీర్చాలి. ఈ హామీలివ్వాలి. వినకుంటే అధికారాన్ని ఉపయోగించి బెదిరించాలి కూడా.
ఏదైనా చేయండి. ఏకగ్రీవాలు చేయాలి. అవి మన ఖాతాలో పడాలి. ఎన్నికలు జరిగితే పోటీలో ఉంటే అవతలోడే గెలుస్తాడు. మన పరువు పోతుంది.. అనే భయం సీఎంను వెంటాడుతున్నది.