వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
పద్మ పురస్కరాల ఎంపిక పై విభిన్న స్వరాలు వినిపించాయి. వివిధ రంగాల్లో పేరుగాంచిన వారికి పద్మ పురస్కరాలను అందజేసింది కేంద్రం. అయితే కొన్ని పేర్ల ఎంపికలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కరెక్టుగా లేదనే వాదనలు వినిపించాయి. విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా దీన్నిఎండగడుతూ కొందరు పోస్టింగులు పెట్టారు. ప్రధానంగా బాలక్రిష్ణపై ఎక్కువ మంది విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఓ ప్రాంతీయ పార్టీకి కేంద్రానికి మధ్య సయోధ్య ఉంటే ఇలా పద్మ పురస్కరాలు ఎంత లాభిస్తాయో అని కూడా కొందరు సెటైర్లు వేయడం.. చంద్రబాబు, బాలక్రిష్ణను ఉద్దేశించి విమర్శించినట్టుగా తెలుస్తోంది. గతంలో అడపాదడపా ఇలాంటి వివాదాలు, విమర్శలు పురస్కారాలపై వచ్చినప్పటికీ.. ఈసారి విమర్శల పదను కొంచెం ఎక్కువగానే ఉంది.