(దండుగుల శ్రీనివాస్)
అనిల్ రావిపూడి. సినిమా డైరెక్టర్. తను వెంకటేశ్‌తో డైరెక్ట్ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమా జనాలకు రీచ్ అయ్యేందుకు అతను పడుతున్న తపన అంతా ఇంతా కాదు. దీనికి నిర్మాత దిల్ రాజు. జిల్లాలు తిరుగుతూ ప్రమోషన్ కార్యక్రమాలు, ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లతో హడావుడి చేస్తున్నాడు. ఏ ఛానెల్ చూసినా వెంకీ కనిపిస్తున్నాడు. నవ్విస్తున్నాడు. జనాల్లో సినిమా పట్ల హైప్ పెంచుతున్నాడు.
వీరు చేస్తున్న ఈప్రచార కార్యక్రమాలకు ఈ సినిమా పేరు సంక్రాంతికి వస్తున్నాం… ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో కాంగ్రెస్ పథకాల విడుదలకు సిద్దమైంది. అవును.. కాంగ్రెస్ సోషల్ మీడియా ఈ పేరును తమ పథకాల కోసం వాడుకున్నది. నాలుగు సంక్షేమ పథకాలను సంక్రాంతికి తెస్తున్నాం… అని పెట్టేసుకున్నది. ఇది జనాలకు మరింత రీచ్ అవుతున్నది. వెంకీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం… రేవంత్ పథకాల విడుదల సక్రాంతికి తెస్తున్నాం.. ఇదిగో ఇలా ఉండాలె ప్రచారం అంటే. జనానికి ఎలా చేరువకావాలె.. తొందరగా ఎలా రీచ్ కావాలె.. జనం తొందరగా ఎట్ల రిసీవ్ చేసుకోవాలె… తద్వారా సర్కార్‌కు మంచిపేరు తెచ్చిపెట్టేందుకు పీఆర్ స్టంట్లు ఏమేమి చేయాలె… ఇగో ఇదే పని చేస్తున్నట్టుంది కాంగ్రెస్ సోషల్ మీడియా.
మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కోట్లకు కోట్లు గుమ్మరించి ఇస్తున్న ప్రకటనల వల్ల కూడా జనం నుంచి ఇంత రెస్సాన్స్ రాదేమో. ఇంత రీచింగ్ ఉండదేమో…!