(దండుగుల శ్రీనివాస్)
నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..! ఇది గబ్బర్ సింగ్ సినిమాలోని పవన్ పాపులర్ డైలాగ్. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనే కాదు పొలిటికల్ జీవితంలో కూడా ఇది నిజంగా ఆయనకు వర్తించింది. నిజమైంది. తనో ముక్కుసూటి మనిషి.. రీల్ హీరో కాదు.. రియల్ హీరో అని నిరూపించుకున్నట్టయ్యింది. ఇంతకీ ఏమంది..! అంతలా పవన్ మోసేస్తున్నావ్ అంటారా..? అదే అందరికీ తెలిసిందే. పుష్ప-2 వివాదంలో లేటుగానైనా సినీ హరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ స్పందించాడు. సీఎం రేవంత్‌రెడ్డి చేసింది వందకు వందశాతం కరెక్టేనని కితాబు కూడా ఇచ్చాడు. అల్లు అర్జున్ అలా చేసి ఉండాల్సింది కాదని ముఖం మీదే చెప్పేశాడు. తన మనసులో మాట బయటపెట్టేశాడు.
అల్లు అర్జున్ ప్లేస్‌లో రేవంత్‌రెడ్డి ఉన్నా కూడా ఇదే విధంగా చట్టం తనపని తాను చేసుకుపోయేదని కూడా చెప్పాడు పవన్. అసలు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు ధియేటర్‌కు వెళ్లాల్సిందే కదాన్నాడు. అందుకే తను సినిమాలను థియేటర్లో చూడనని కూడా చెప్పిన పవన్… సంధ్య థియేటర్‌లో ఆ దుర్ఘటన జరిగిన తరువాత వెంటనే అల్లు అర్జున్ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉండేనని, కనీసం ఆ చిత్ర బృందమన్నా వెళ్లాల్సిందన్నాడు. రేవంత్ రెడ్డి ఇది కక్ష పూరితంగా చేసిందని, అతని పేరు ఉచ్చరించనందుకు ఇలా చేశాడని ప్రచారం చేయడం సరికాదన్నాడు. కష్టపడి కింది స్థాయి నుంచి సీఎం దాకా ఎదిగిన రేవంత్‌ను ఆయన ప్రశంసించాడు.