లగచర్ల ఘటనలో కేటీఆర్‌ను వదల…!
రైతులపై కేసులుండవు….!
పరిహారం పెంచుతా…!!
అది ఫార్మా సిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్…!
యువత, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తా…!
కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతా…!
సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ…!
(దండుగుల శ్రీనివాస్)
లగచర్లలో వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కుట్రలో కీలక సూత్రధారి కేటీఆర్‌ను వదిలేదే లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీని వెనుక కచ్చితంగా కుట్ర జరిగింది. ఆ కుట్రకు కీలక సూత్రధారి కేటీఆర్. దీని వెనుక ఎవరున్నా వదలా..! కేటీఆర్‌ను వదిలేదే లేదని ఆయన పరోక్షంగా మరోసారి క్లియర్‌కట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు రైతులపై కేసులు ఎత్తివేస్తానన్నారు. అమాయక రైతులను ఇబ్బందులెందుకు పెడతా..? అసలు నా నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకేముంటుంది…? ఇక్కడి ప్రజలు అభివృద్ది చెందాలె. కొండగల్ నియోజవకర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలె… ఇదే కదా నా కోరిక… అని ఆయన తనను కలిసిన కమ్యూనిస్టు నాయకులతో మాట్లాడారు.
తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. కొడంగల్‌లోఏర్పాటు చేయబోయేది ఫార్మాసిటీ కాదని కూడా క్లారిటీ ఇచ్చారు. అది ఇండస్ట్రియల్ కారిడార్ అని అన్నారు. ఇక్కడ కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేయిస్తానన్నారాయన. ఇక రైతులకు పరిహారం పెంచే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు సీఎం. తప్పుకుండా రైతులకు మేలు జరిగేలా మంచి పరిహారం అందించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కుట్రదారులను వదిలేదే లేదని ఆయన అనడం వెనుక కేటీఆర్‌కు మరింత ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలి ఈ విషయంలో.