(దండుగుల శ్రీనివాస్)
మనోళ్లు అక్కడకు పోయి ఏం చేస్తరు.. మనోళ్లు చెప్పిన మాటలెవరింటరు..!
ఎందుకినరు… ఇక్కడ అధికారంలో ఉన్నం కదా… ఇక్కడి ముచ్చట్లు చెప్పొచ్చు కదా.. ఏమేం చేశాము అని.
ఇక్కడ చేసిందేముంది…? అయ్యిందేముంది..??
అయినా కర్ణాటక నుంచి డీకే శివకుమార్ ఇక్కడికి వచ్చి మనకు ప్రచారం చేస్తే మనమింటామా..?
అవును..! కరెక్టే కదా..
మరి అక్కడేం చేస్తున్నట్టు…?
ఏముంటది.. పైసలు ఇస్తందుకు పోతరు…!
ఎవరిస్తరు.. పర్సనల్ పైసలా… పార్టీ పైసలా..! జనాల సొమ్మా..!!
పర్సనల్‌వి అడిగేంత ఉండదు లే..!
మరి ఇక్కడి గవర్నమెంట్ సపోర్టే….
అంటే మనోళ్లు అక్కడ ఉన్నది పైసలు చేరవేసి అరేంజ్‌మెంట్స్ చేసేందుకేనా..?
అంతేగా మరి..!
మన బాపు గెలిచి ఉంటే కూడా అక్కడ ఎంత ఖర్చు పెట్టేవాడో…!
ఆయన అప్పుడు పెట్టినవి.. ఇప్పుడు పెట్టేటివి అన్నీ ఇక్కడి జనం పైసలే ..
మనకెందుకూ పనికిరాని ఆ ఎన్నికల్లో గెలుపు కోసం మన పైసలు పెట్టుడు అవసరమా..!
పెట్టాల్సిందే కదా..! గెలిచిన రాష్ట్రమాయే..!
ఇక్కడ మనకే దిక్కులేదు కదా… అక్కడి మరాఠీలకు మందు తాపించేందుకు, ఓటుకు నోటు పంచేందుకు ఈ పనులు చేయాల్సిందేనా..!
అంతే అదే రాజకీయం.. ఎవడు గెలిచినా అంతే. పెద్దగా మార్పుండదు.. ఎవడిగోల వాడిదే..!