(దండుగుల శ్రీనివాస్)
అధికారంలో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్టు కేటీఆర్ చేసిన నిధుల దుర్వినియోగంపై సర్కార్ నజర్ పెట్టింది. ఇప్పటికే ఫార్మూలా- ఈ కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్దంగా విదేశీ కంపెనీలకు 55 కోట్లు కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు పంపారని దీనిపై ఏసీబీ విచారణకు సర్కార్ సిద్దమయ్యింది. అరెస్టు కూడా చేసేందుకు రంగం సిద్దమయ్యిందనే ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో.. తాజాగా ఆ సర్కార్ హయంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేసిన కొణతం దిలీప్ పై ఎంక్వైరీ మొదలు పెట్టింది.
రూ. 15 కోట్లు డిజిటల్ మీడియా డైరెక్టర్‌కు ఐఅండ్‌పీఆర్ ద్వారా కేటీఆర్ నిధులు విడుదల చేశారు. ఇప్పుడా జీవో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ నిధులేమయ్యాయో నిగ్గు తేల్చాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ నిధులను వాడుకోవాల్సిందిగా ఆ జీవోలో ఉండగా.. గులాబీల జెండలే రామక్క అనే పాట కోసం, సోషల్ మీడియా నిర్వహణ కోసమే ఈ నిధులు కేటీఆర్ విడుదల చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో పది కోట్ల వరకు కొణతం దిలీప్ వాడుకుని మిగిలిన 5 కోట్లు డిజిటల్ మీడియాలో పనిచేసిన వారికి ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడిది చర్చనీయాంశమైంది.