
Related Post
తప్పిదారి మేం గెలిస్తే…!? రామన్న మాటల్లో ఆంతర్యమేమిటో..!? అంటే గెలవడం కష్టమేనని ఒప్పుకోవడమా? ఒకవేళ గెలిస్తే మిమ్మల్ని వదలబోమనే బెదిరింపులా? ఒకవేళ మేం గెలిస్తే.. అంటే.. ఆ గెలుపు ఆశలు తగ్గుతూ వస్తున్నాయని ఒప్పుకున్నట్టా? గెలవడం కష్టమే కానీ… గెలిస్తే మాత్రం పగలు, ప్రతీకారాలకే పరిమితమవుతారని చెప్పుకోవడమా? మీరు ప్రతీకారాలు తీర్చుకునేందుకు మిమ్మల్ని గెలిపించాలా ప్రజలు.. హుందాతనం వీడి.. గల్లీ లీడర్‌గా మారిపోయిన కేటీఆర్.. కేసీఆర్ ఆనవాళ్లను ఎవరో కాదు.. కొడుకే తుడిచేసేలా ఉన్నాడు.. జనం ఇదే అనుకుంటున్నారు..! జర వెనకాముందు చూస్కోండ్రీ… ప్రజల ఆకాంక్షల కోసం పోరాడండి.. బాలయ్యబాబు సినిమా డైలాగులు కాదు మీ నుంచి జనం కోరుకునేది!
Feb 9, 2026
Dandugula Srinivas
