(దండుగుల శ్రీనివాస్)
సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన రచ్చ రాజకీయానికి వెనుకుండి డైరెక్షన్ చేసింది మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీయేనని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఆయన నిన్న జీవన్‌రెడ్డిని పరామార్శించి వచ్చారు. ఈ నేపథ్యంలో మళ్లీ మధు మరోసారి తెరపైకి వచ్చాడు. మధుయాష్కీకి పీసీసీ పదవి దక్కినట్టే దక్కి చేజారింది. అదే సామాజికి వర్గానికి చెందిన మహేశ్‌కే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో ఇటు ఎమ్మెల్యేగా ఓడి, పీసీసీ చేజారి తీవ్ర అసంతృప్తిలో ఉన్న మధుయాష్కీ అధిష్టానం మీద తిరుగుబాటు చేయడానికే సిద్దమయ్యాడు. ఇదాయనకు అలవాటైన దోరణే.
గతంలో కూడా పీసీసీ చీఫ్‌గా రేవంత్ ఉన్నప్పుడు ఆయనపై ఇష్టారీతిన మాట్లాడి వివాదాస్పదమ్యాడు. సీఎం అయిన తరువాత కూడా రేవంత్‌తో అంటీముట్టనట్టుగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రేవంత్ .. మధుకు చెక్‌పెట్టి మహేశ్‌కే పీసీసీ దక్కేలా చక్రం తిప్పి సక్సెసయ్యాడు. దీంతో అప్పట్నుంచి ఇటు మహేశ్, అటు రేవంత్‌పై తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నాడు మధు. తనలా పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలందరినీ దగ్గర చేర్చి కూటమి కట్టేందుకు ప్లాన్ వేసుకున్నాడనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డి ఇష్యూ రచ్చ కావడంతో మరింత అగ్నికి ఆజ్యం పోశాడు మధు.
పీసీసీ చీఫ్ మహేశ్ ఫోన్ చేసినా కట్ చేసిన జీవన్‌రెడ్డి… అధిష్టానాన్ని, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శల చేయడం వెనుక మధుయాష్కీ డైరెక్షన్ ఉందనే విషయం ఇప్పుడాపార్టీలో తీవ్రంగా డిస్కషన్ జరుగుతోంది. ఇంత చెప్పినా జీవన్ రెడ్డి మాత్రం పార్టీ వీడటం లేదు. ఒకవేళ ఆయన పార్టీకి రాజీనామా చేసినా బుజ్జగించే వారు లేరు. అలా ఉంది జీవన్ పరిస్తితి పార్టీలో. సీనియర్ అనే గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నాడు. అందుకే పార్టీలోనే ఉంటూ మధుతో కలిసి పొగబెట్టే కార్యక్రమానికి నాంది పలికాడన్నమాట.