వాస్తవం- హైదరాబాద్:
ఈరోజు యశోద హాస్పిటల్ లో వడ్డెర సంఘం నాయకులు పీట్ల కథాల్ గారిని పరామర్శించడం జరిగింది. ఈనెల 5వ తారీఖు నాడు కడ్తాల్ టోల్గేట్ టోల్ ప్లాజా దగ్గర కథాల్ గారిని సంజీవ్ యాదవ్ అనుచరులు కథలు కారు ఆపి కారుపై రాళ్లని ఎత్తేసి కథల్ని కొట్టి కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. తక్షణమే సంజీవ యాదవ్ ని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్యగారు డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో ఈ విషయాన్ని జిల్లా ఎస్పీగారి దృష్టికి తీసుకువేళ్ళారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయకపోతే ధర్నా రాస్తారోకోలు చేయడం జరుగుతుందని తేలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు డేరంగుల రూప మహేశ్వరి గారు యువజన అధ్యక్షులు కొమ్మరాజుల శేఖర్ గారు శివరాత్రి వెంకటేష్ గారు జగన్ గారు రాము గారు కొమ్మరాజుల శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.