(దండుగుల శ్రీ‌నివాస్‌)

బీసీ నేత‌కే అధిష్టానం ఓకే చెప్పింది. విధేయ‌త‌కే ప‌ట్టం గ‌ట్టింది. అంచెలంచెలుగా ఎదిగి అంద‌రివాడు అనిపించుకున్న బొమ్మ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. ఈ మేర‌కు అధికారికంగా నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. నిజామాబాద్ నుంచి డీఎస్ త‌రువాత మ‌ళ్లీ బీసీ నేత‌గా పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టిన మ‌హేశ్‌.. మ‌రోసారి ఇందూరు పేరును ఢిల్లీ రాజ‌కీయాల్లో వినిపించేలా చేశారు.

నిజామాబాద్ అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిన ఆయ‌న పార్టీ ఎదుగుద‌ల‌కు క‌ట్ట‌బుడి ప‌నిచేస్తూ వ‌చ్చారు. అధిష్టానం ఏ పిలుపునిచ్చినా దాన్ని అందిపుచ్చుకుని విజ‌య‌వంతం చేయ‌డంలో, రాష్ట్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు మ‌హేశ్‌. ఢిల్లీ పెద్ద‌ల‌తో ఆనాటి నుంచి సత్సంబంధాలు నెరుపుతూ వ‌చ్చాడు. బీసీ నేత‌గా ఎదిగి వ‌చ్చాడు.

ఎన్ఎస్‌యూఐ నుంచి విద్యార్థి నేత‌గా ప్ర‌స్థానం ప్రారంభించి పెద్ద‌ల ఆశీస్సుల‌తో లీడ‌ర్‌గా త‌న‌కు తాను తీర్చిదిద్దుకుంటూ వ‌చ్చారు మ‌హేశ్‌. ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చి మ‌హేశ్‌కు స‌ముచిత ప్రాధాన్యం ఇచ్చిన అధిష్టానం ఇప్పుడు పీసీసీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. సీఎం రేవంత్‌కు కూడా అత్యంత ఆప్తుడిగా ఉన్న మ‌హేశ్‌… పార్టీని, ప్ర‌భుత్వాన్ని న‌డిపించ‌డంలో వీరిద్ద‌రూ జోడెద్దుల బండిలా ముందుకు సాగుతార‌ని అధిష్టానం భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

You missed