(దండుగుల శ్రీనివాస్)
దిలీప్ కొతణం అరెస్టుపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కచ్చితంగా కక్షసాధింపు చర్యలో భాగంగా ఆయన అరెస్టు జరిగిందనేది అందరికీ తెలిసిందే. అసలు ఆయన్ను ఎందుకు అరెస్టు చేశారనే విషయాన్ని పరిశీలిస్తే అదంతా పెద్ద నేరమైనదేమీ కాదు. దీనిపై అరెస్టుల దాకా వెళ్లాల్సిన అసవరమూ లేదు. ఇప్పుడు దిలీప్ అరెస్టు నేపథ్యం… తీన్మార్ మల్లన్న ఉదంతాన్ని గుర్తు చేసుకోవాల్సిన సందర్బం తెచ్చి పెట్టింది. ఎందుకంటే.. నాడు తీన్మార్ మల్లన్న మీడియా ముసుగులో వ్యక్తిగత దూషణలకు వెళ్లాడు.
లంగ, లఫంగ, చిచి, తైతక్క, లత్కోర్, కొడకా….. చాలా చాల హద్దులు దాటాడు. అది మీడియా భాషనే కాదు.. మల్లన్న ఓ జర్నలిస్టే కాదు అనే విధంగా నడిపించాడు. కేసీఆర్ ఆనాడు అంతో ఇంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు గనుకే తీన్మార్ మల్లన్న జోలికి వెళ్లలేదు. ఒక సందర్భంలో శృతి మించి.. హద్దులు దాటిపోయి.. విపరీత పోకడల తరువాతే అరెస్టు జరిగింది. ఆనాడు తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలంటే రోజుకోసారి అరెస్టు చేయించాలి కేసీఆర్. కానీ అలా చేయలేదు.
మరి చిన్న చిన్న వాటికీ అరెస్టులదాకా వెళ్లడం అంటే దీని వెనుక కచ్చితంగా కక్షసాదింపే తప్ప వేరేదేమీ లేదు. ఈ అరెస్టులు కొంత మందికి స్వాంతన ఇచ్చి ఉండవచ్చు కానీ, అంతిమంగా గవర్నమెంటుకు మాత్రం మంచిదేం కాదు. ఇక దిలీప్ విషయంలో ఉద్యమకారులు కొందరు విరుచుకుపడుతున్నారు. అసలాయన ఉద్యమకారుడే కాదంటున్నారు. ఉద్యమం పేరు చెప్పి.. కార్యకర్తల కష్టాన్ని దోచుకుని కోట్లకు పడగలెత్తి తమను కేటీఆర్, కేసీఆర్‌ను కలవనీయకుండా చేశాడని దుయ్యబడుతున్నారు.
అరెస్టులయిన ఉద్యమకారులను ఎంత మందిని ఆయన కాపాడాడు…? ఉద్యమకారుల కోసం ఆయన చేసిందేమీ లేదు.. వారి పేరు చెప్పుకొని ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప .. అని తిట్టిపోస్తున్నారు.