(దండుగుల శ్రీనివాస్)
ఈ సుదర్శనుడు చాలా సీనియర్. ఇక రాజకీయాలకు స్వస్తి పలికి ఇంటికే పరిమితమైదామనుకున్నాడు. గెలుపు కూడా అతికష్టం మీదే జరిగింది. అదృష్టావశాత్తూ సర్కార్ వచ్చింది. ఇక ఆశ పుట్టింది. మంత్రి పదవి కంపల్సరీ. రేవంత్‌కు అత్యంత సన్నిహితుడు, సీనియర్ మోస్ట్. మరి ముందే మంత్రి పదవి రావాలి. కానీ రాలే. ఇక రేపో మాపో విస్తరణ అంటూ ఊరించి ఊరించి రోజులు గడుస్తున్నాయే తప్ప అదింకా రాలేదు.
పెద్ద మనిషి కొంత నారాజ్‌లోనే ఉన్నాడు. ఇది సీఎం రేవంత్‌కు తెలిసింది. వెంటనే నిజామాబాద్ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. ఆయనకు మంత్రి ప్రొటోకాల్ ఇవ్వండి. ఇప్పుడు ఆయన ఇక్కడ మంత్రి కాని మంత్రి అన్నమాట. అంతే కాదండోయ్.. ఆయన మన హోం మినిష్టర్ కూడా. ఈ విషయమూ లీక్ చేశారు సర్కార్ పెద్దలు. దీంతో పోలీసులు కూడా పోలోమని ఖాకీ మర్యాదలన్నీ చేసేస్తున్నారు.
ఇగ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్నా కానీ అని మనసు నిమ్మళం చేసుకున్న సుదర్శన్‌రెడ్డి అలా అలా జిల్లా మొత్తం చుట్టి వస్తున్నాడు. ఇదన్నమాట సంగతి.