వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

ఆవు చేలో మేస్తే దూడ గ‌ట్టున మేస్తుందా…? ఇది క‌రెక్టుగా న‌ప్పుతుంది సీఎం రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ సోష‌ల్ మీడియా టీమ్‌కు. సీఎం కాక‌ముందు ఆయ‌న మాట‌ల శైలి ఇదే. ఎంతగా దునుమాడితే.. ఎంత బాగా తిడితే అంత పాపులారిటీ వ‌స్తుంద‌ని న‌మ్మిన నాయ‌కుడు రేవంత్‌. పీసీసీ చీఫ్‌గా ఉన్న‌ప్పుడు , ఆ త‌రువాత సీఎంగా అయిన త‌రువాత కూడా ఇదే పంథాను అనుస‌రించాడు. అప్పుడు ఓకే అని అనుకున్నా.. సీఎం హోదాలో ఇలాంటి వ్యాఖ్య‌ల ప‌ట్ల స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇప్ప‌డీ టాపిక్ ఎందుకంటే రేవంత్ బాట‌లోనే ఆ పార్టీ సోష‌ల్‌మీడియా కూడా వెళ్తోంది. రేవంత్ చేత శ‌భాష్ అనిపించుకునేందుకో.. ఆయ‌న నాడి ప‌సిగ‌ట్టి ఇలాగే చెబితే త‌ప్ప మనం ఫోకస్‌లోకి వ‌చ్చి అవ‌తలి వాడిని బొంద పెట్టొచ్చ‌నే భావ‌నో కానీ ఇలా ఫిక్స్ అయిపోయి ఇప్పుడు పీక‌ల మీద‌కు తెచ్చుకుంటున్నారు.

కవిత బెయిల్ పొందిన విషయంలో రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నందున కవిత బెయిల్ పై వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్టులపై వివరణ కోరింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్, వాట్సప్ గ్రూపుల్లో కవిత బెయిల్ అంశంపై వ్యాఖ్యలపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

కవితకు బెయిల్ వచ్చిందా..? ఇచ్చారా..? ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని సోషల్ మీడియాలో పోస్ట్ తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్ చేసింది. కమలంతో స్నేహం..తైతక్కకు మోక్షం అని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్ చేసింది. వీటిపై సుప్రీం చాలా సీరియస్‌గా ఉంది. అందుకే, ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed