(దండుగుల శ్రీనివాస్)
నమస్తే తెలంగాణ పేపరోళ్లకు గాదె ఇన్నయ్య ఇంటర్వూ తీసుకోవాలని ఎందుకనిపించిందో తెల్వదు. అంతేమరి ఆ ఎడిటర్ ఏం చేసినా తిరిగి తిరిగి కేసీఆర్‌ను, ఆ పార్టీకే తగులుతుంది దెబ్బ. మేలు జరిగే విషయమేమో గానీ కెలికి తన్నించుకున్న విధంగానే ఉంటాయా పంతులు ఆలోచనలు. సరే ఇప్పుడా పత్రిక సంగతెందుకు గానీ, ఇన్నయ్య ఇంటర్వ్యూను పరిచేసిన పేపర్ కటింగ్ చక్కర్లు కొడుతూ కొడుతూ ఆ నాటి సీనియర్ ఉద్యమకారుల దగ్గరకూ వెళ్లిందాముచ్చట. దీనిపై ఎవరికి వారు తమ అనుభవాలను చెప్పుకున్నారు. ఈ ఇంటర్వ్యూ వల్ల కేసీఆర్‌కు నయాపైస లాభం లేదుగానీ, ఎప్పుడో మరిచిపోయిన ఇన్నయ్య మళ్లీ జనం ముందుకు తెచ్చిందీ న.తె.
గాదె ఇన్నయ్య చెప్పిందాంట్లో చారాణ నిజం ఉన్నమాట నిజమే. కానీ బారాణ పాలు అబద్దమే.
కేసీఆర్ డబ్బుల్లేక ఇబ్బంది పడ్డ మాట నిజమే. హరీశ్ మమ్మల్నే అడుగుతుండె. ఇంట్లో ఏం పైసల్లేవని. అప్పుడో పది పదిహేను వేలు మేమే ఇచ్చేది. పది రూపాయల వడ్డీకి కూడా తీసుకునేవాడు కేసీఆర్. ఆ వడ్డీకి ఇచ్చేది ఇప్పటి నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావే.
అప్పటి వరకు సైలెంట్‌గా వింటున్న నేను.. ఒక్కసారిగా అవాక్కయ్యాను.
ఏందీ..? దామోదర్ రావు పది రూపాయల వడ్డీకి కేసీఆర్‌కు అప్పుచ్చేదా..?
అవును..! ఆయన దందా అప్పుడు అదే. ఇచ్చేది. ఇచ్చిన పైసలు వసూలు చేసేందుకు రచ్చ కూడా చేసేది.
మెయినాబాద్‌లో తోట అమ్ముకున్న మాట కూడా వాస్తవమే.
కేసీఆర్ మారింది అధికారం వచ్చినంకనే. కానీ అప్పట్లోనే కేసీఆర్ మరీ లేజీ. అహంకారి కూడా. ఎవరితో కలిసేది కాదు. నందినగర్‌లో ఇంట్లో పైన కూసొని పర్మిషన్ ఇచ్చిన వాళ్లనే కలిసేది.
ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంపీలు కలిసేందుకు వస్తే వాళ్లకు టైం ఇచ్చేది కాదు.
టీఆరెస్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చి రోజుల తరబడి పడిగాపులు కాసి వెళ్లిపోయేది.
ఎన్టీఆర్ అసొంటిది వచ్చిన వాళ్లందరినీ కలిసి పలకరించి వెళ్లిపోయేది. కానీ కేసీఆర్ అలా కాదు. డిఫరెంట్.
ఫామ్‌హౌజ్‌కైతే ఎవరికీ అనుమతి ఉండదు. అనుమతి లేకుండా వస్తే గేటు దగ్గర పడిగాపులు కాయాల్సిందే..
– ఇలా చెప్పుకుంటూ పోయారంత. ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ ఆలోచన మాత్రం ఎప్పుడూ తెలంగాణ గురించే ఉండేది బై. కానీ మిగితావాళ్లను కూడా పట్టించుకోవాలె కదా. టీఆరెస్ కార్యకర్తలనైతే అస్సల్ పట్టించుకోకపోయేది. ఇగ ఆత్మగౌరవం దెబ్బతినదా..? అందుకే అంతా దూరమయ్యారు. ఇలా కొనమెరుపుగా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.