(దండుగుల శ్రీ‌నివాస్‌)

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, సీనియ‌ర్ నాయ‌కుడు గాదె ఇన్న‌య్య చాలా రోజుల‌కు ఇలా వార్త‌ల్లోకెక్కాడు. కేసీఆర్ ఉద్య‌మ‌కారుల ఆత్మ‌భిమానాల‌ను చంపాడ‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల‌ను వంచించాడ‌ని విరుచుకుప‌డే ఆయ‌న‌.. తాజాగా న‌మ‌స్తే తెలంగాణ‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చాడు. ఆయ‌న‌కు డ‌బ్బంటే ప్రేమే లేద‌ని, మంచివాడ‌ని… ఇంకా ఏదేదో చెప్పుకొచ్చాడు. దీనిపై ఇన్న‌య్య ను బీఆరెస్ శ్రేణులు తెగ పొగిడేస్తుంటే… చాలా మంది ఆయ‌న‌కేమైంది..? అంటూ విరుచుకుప‌డుతున్నారు. కేసీఆర్‌పై మ‌రోసారి ఇన్న‌య్య కామెంట్స్‌కు వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు. గుర్రం సీతారాములు ఇలా సోష‌ల్ మీడియాలో వ్యంగ్యంగా త‌న కామెంట్‌ను పోస్టు చేశాడు.

కేసీఆర్‌ మంచివాడా చెడ్డ వాడా నాకు అనవసరం. విశాల తెలంగాణ కు ఆయన ఆరో వేలు, అది ఒడిసిన ముచ్చట.
కానీ ఇన్నయ్య అంటే వందల ఎకరాలు వదిలి, ప్రాణాలు ఫణంగా పెట్టి , దశాబ్దాలుగా నిస్వార్ధంగా బ్రతికిన మనిషి.. అని రెండు మూడు తరాలు నమ్మాయి, నమ్ముతున్నాయి కూడా. మరిప్పుడు ఏమైంది ఇన్నయ్య కు ? కేసీఆర్ డబ్బుని ప్రేమించడు : మాజీ పీపుల్స్ వార్ నాయకుడు గాదె ఇన్నన్న. కెసిఆర్ నిస్వార్ధ జీవి… ఆయన ఎవరికీ బి టీం కాదు..నిజమే ప్రాంతీయ పార్టీ ని జాతీయ పార్టీ చేసి థర్డ్ ఫ్రంట్ జూటా అని నాలుగో ఫ్రంట్ పెట్టి INDIA కూటమి ని నిర్వీర్యం చేసి అనుకూల శక్తిగా ప్రధాని రేస్ లో ఉన్నా అని చెప్పాడు.


కేసీఆర్‌ హింసను ప్రేమించడు. కానీ హింస తోనే తెలంగాణ వచ్చింది. వందల మంది చావులకు నెహ్రూ, ఇందిర, సోనియా, రాహుల్ కారణం. కేసీఆర్‌ మాత్రం కాదు. అందుకే అన్ని అమరుల కుటుంబాలకు భూమి, పదవులు ఇచ్చాడు.కేసీఆర్ కు బంధు ప్రీతీ లేదు. నిజమే ఆయన కొడుకు కే టి ఆర్, బిడ్డ కవిత, అల్లుడు ఆణిముత్యం ఇంకో కొడుకు బసంతి …ఇంకా అప్పుల్లోనే ఉన్నారు . రోజూ ఢిల్లీ రైల్లో పోయి టాక్సీ లలో తిరుగుతున్నారు. అందుకే బిడ్డ తీహార్ జైలు లో నొటోరియస్ క్రిమినల్స్ మధ్య ఆరు నెలలు ఉన్నా గుండెను రాయి చేసుకున్నాడు తప్ప బిడ్డ ను పలకరించలేదు. కేసీఆర్ ఉన్న పొలం అమ్ముకున్నాడు. అవును అందుకే ఎర్రవల్లి లో వందల ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తూ ఎకరానికి కోటి సంపాదిస్తున్నాడు. కుంట భూమి లేని నిరుపేద. ఆయన తొమ్మిదేళ్ళ పాలన కాలం లో తొమ్మిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దానికి కారణం నెహ్రూ.
కెసిఆర్ సాధు జీవి.
నిజమే శ్రుతి, విద్యాసాగర్ లు . వికారుద్దీన్ తో బాటు నలుగురు తమకు తామే కాల్చుకుని చనిపోయారు.
కేసీఆర్‌ జేబులో రూపాయ ఉండదు. నిజమే గ్యాంగ్ స్టర్ నయూం ని చంపి అతని వద్ద ఉన్న వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు పదిలంగా రాష్ట్ర ఖజానాకి ఇచ్చాడు. అక్టోబర్ 12, 2023 నాడు నిన్ను తెలంగాణ పోలీసులు కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారు అని మేమంతా ఆందోళన పడ్డాం. మీరిద్దరూ గజ్వేల్ ఫాం హౌస్ లో ముచ్చట్లు పెట్టుకున్నారా అని ఇప్పుడు అడగాలి అనిపిస్తోంది . ఇన్నారెడ్డి అంటే ఆయన మాటకు ఒక ‘విలువ‌.
ఆ ‘విలువ’ పదిలంగా కాపాడుకుంటున్న అన్నకు జై తెలంగాణ. కేసీఆర్ వంటి నిస్వార్ధ జీవి పార్టీ ని పార్లమెంట్ లో లేకుండా చేసిన తెలంగాణ ఉద్యమ ద్రోహులు ముర్దాబాద్. ఇప్పుడే ఆయనను ఉన్నప‌ళంగా రాష్ట్రపతి ని చేయాలి అని అఖిల భారత కేసీఆర్‌ అభిమాన సంఘం తీర్మానం.

Gurram Seetha ramulu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed