వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యమవుతోంది. సీఎం రేవంత్‌పై నేతల ఒత్తిళ్లు పెరిగాయి. నాకు కావాలంటే నాకంటూ సీనియర్లు బారులు తీరారు. దీంతో ఇది తెగని పంచాయితీగా మారింది. అధిష్టానానికి తన లిస్టు తానిచ్చేసి చక్కా వచ్చేశాడు రేవంత్. ఇప్పుడు డిసైడ్ చేయాల్సింది ఢిల్లీ పెద్దలే. మరో వారం పదిరోజుల సమయం తీసుకునేలా ఉన్నారు.
దీంతో ఎప్పుడెప్పుడా అని ఆశలు పెట్టుకున్న నేతలకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కే మొగ్గు చూపుతున్నది అధిష్టానం. కానీ ఇంకా చివరి ప్రయత్నాల్లో ఉన్నారు ఒకరిద్దరు. దీనిపై ఓ క్లారిటీకి వచ్చిన అధిష్టానం రెండ్రోజుల్లో పీసీసీ చీఫ్ ఎవరనేది డిక్లేర్ చేయనున్నారు. మంత్రివర్గమే మరింత ఆలస్యమయ్యేలా ఉంది. కుల సమీకరణల నేపథ్యంలో ఇది సీఎం రేవంత్‌కు, అధిష్టానానికి పెద్ద తలనొప్పిలా మారింది.