వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
నాగార్జున ఎన్ కన్వెన్షన్ నేలపాల్జేసిన హైడ్రా..ఇప్పుడు కేటీఆర్ ఫామ్‌హౌజ్‌కు గురిపెట్టింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని జన్వాడాలోని కేటీఆర్‌కు చెందిన ఫామ్‌హౌజ్‌ను కూల్చేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇక్కడ కొలతలు వేశారు. ఎంత మేర ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ను మించి ఉందనే విషయంలో లెక్కలు వేసుకున్నారు.
అసలు తొలత స్పాట్ పెట్టాల్సింది ఈ ఫామ్‌హౌజ్‌నే. కానీ అది పక్కా రాజకీయ కోణంలో జనాలు చూస్తారని … అందుకే ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను ఎంచుకున్నారు. నాగార్జున అక్రమ కట్టడం కూల్చడంతో ప్రభుత్వంపై జనాలకు కొంత మంచి అభిప్రాయం ఏర్పడింది. ఎవరిదైనా వదిలేలా లేరనే సంకేతాలు ఇవ్వడం ద్వారా ఇక మిగిలిన టార్గెట్ రీచ్ అయ్యేలా అడుగులు వేస్తోంది హైడ్రా.
మంగళవారం కేటీఆర్ ఫామ్‌హౌజ్ లో కొలతల కార్యక్రమం పూర్తి చేసి ఇక ఉదయమే దీన్ని నేలమట్టం చేసేలా పావులు కదుపుతున్నది. ఇప్పటికే దీనిపై కోర్టుకెక్కాడు కేటీఆర్ మిత్రుడు. కానీ కోర్టు దీన్ని కూల్చేయకుండా స్టే విధించలేకపోయింది. దీంతో హైడ్రా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది. దీని తరువాత స్పాట్ ఎవరికి పెడతారో చూడాలి.