వాస్త‌వం ప్రధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌:

ఎట్ట‌కేల‌కు కవిత‌కు జైలు జీవితం నుంచి విముక్తి ల‌భించింది. 153 రోజుల పాటు ఆమె జైలు జీవితం అనుభ‌వించింది. నేడు రేపు అంటూ బెయిల్ కోసం ఎదురుచూస్తూ వ‌చ్చిన కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి చుక్క‌లు చూపింపింది ఈడీ. ఎట్ట‌కేల‌కు ఇవాళ సుప్రీంకోర్టులో ఆమెకు ఈడీ కేసు నుంచి బెయిల్ ల‌భించింది.

ఈ ప‌రిణామం కేసీఆర్ అండ్ ఫ్యామిలీలో గొప్ప రిలీఫ్‌నిచ్చింది. బీఆరెస్ శ్రేణుల‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.

ఆమెకు క‌చ్చితంగా ఇవాళ బెయిల్ ల‌భిస్తుంద‌ని అంచ‌నా వేశారు బీఆరెస్ శ్రేణులు. సోమ‌వారం ఉద‌య‌మే ఢిల్లీ వెళ్లారు. ఆమె రాక కోసం అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న త‌రుణంలో ఎట్ట‌కేల‌కు బెయిల్ మంజూరు కావ‌డంతో బీఆరెస్‌లో న‌యా జోష్ నెల‌కొన్న‌ది.

You missed