(వాస్తవం ప్రధాన ప్రతినిధి)
ఆషాఢం పాయె.. శ్రావణం వచ్చె అయినా మంత్రి వర్గ విస్తరణ ఇంకా కాకపాయె..! ఇదిప్పట్లో అయ్యేలా లేదు. ఇదే విషయమై ఢిల్లీకి వెళ్లిన సీఎంకు అక్కడ అధిష్టానంతో చర్చలు సఫలం కాలేదు. వచ్చేనెల 3 తారీఖు తరువాతే దీనిపై ఏదో క్లారిటీ ఇద్దామని డిసైడ్ అయ్యారు. దీంతో మంత్రివర్గంలో తమకు చోటు దక్కుతుందని ఉవ్విళ్లూరుతున్న నేతలు ఉసూరుమనక తప్పడం లేదు. మొన్న పంద్రాగస్టు వేళ కార్పొరేషన్ చైర్మన్లకు జెండా ఆవిష్కరణ బాధ్యతలు అప్పగించడం పార్టీలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది.
ఇంకా జాప్యం జరగడంపై కినుక వహిస్తున్నారు సీనియర్ నేతలు. కాగా పార్టీలోకి ఇంకా ఎవరెవరు వస్తారు..? వారి కోసం ఈ జాప్యమా..? అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. బీఆరెస్‌లోంచి పెద్ద తలకాయలను మొత్తంగా లేపాలని సీఎం భావిస్తున్నాడు. ఈ క్రమంలో కొందరికి మంత్రి పదవి ఆశ కూడా చూపుతున్నారు. అందుకే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో మంత్రి వర్గ విస్తరణ పెండింగ్ పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.