(దండుగుల శ్రీనివాస్)
రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ పెద్దలను కొట్టి పేదలకు పంచింది. ఇది ముందస్తు ప్లానింగే. అంతకు మించి చేసేదేం లేదు కూడా. అక్కడ బడ్జెట్ లేదు. రెండు లక్షల రుణమాఫీకి 31వేల కోట్లు అవుతుందని చెప్పింది కానీ.. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుని వారికి మాత్రమే మాఫీ చేసింది సర్కార్. దీనిపై బీఆరెస్ ఎంత గగ్గోలు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే వందశాతం పేదలకు రుణమాఫీ జరిగిపోయింది. జరగంది ఎవరికీ అంటే ఎమ్మెల్యేలకు, మంత్రులకు, బడాబాబులకు, పెద్ద భూస్వాములకు దక్కలేదీ ఈ పథకం. వారంతా రోడ్డెక్కి గగ్గోలు పెట్టే పరిస్థితి లేదు.
ఇప్పుడు వారి తరపున బీఆరెస్ పోరాడుతానంటుంది. రేవంత్ కూడా తెలుసు. వందశాతం రుణమాఫీ చేయలేదని. చేయలేమని. అంతే హామీ ఇచ్చారు కానీ ఇందులో చాలా కండిషన్లు అప్పుడే అప్లై చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నారు. కేసీఆర్ అప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలకు పథకాలను వాడుకున్నాడు. రుణమాఫీ కూడా అదే విధంగా అమలు చేయాలకున్నాడు. అందుకే బొక్కబోర్లా పడ్డాడు. ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తానని లక్ష వరకు చేసేక్రమంలో చతికిలబడి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
తన ఆనాలోచిత, ఓటుబ్యాంకు కోసం భయపడి అమలు చేసిన విధానమే ఆ పార్టీ కొంప ముంచింది. రైతుబంధు కూడా అదే తరహాలో ఇచ్చాడు కేసీఆర్. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతీరైతుకు ఇవ్వడం చాలా వ్యతిరేకత తెచ్చిపెట్టింది. అయినా డోంన్ట్ కేర్ అన్నాడు. ఎవరికి ఇవ్వకున్నా తనకు నష్టం జరుగుందనే భయం ఆనాడు కేసీఆర్‌ను వెంటాడింది. పక్కాగా రైతు రాజకీయం చేశాడు. ఇక తనకు తిరుగులేదనుకున్నాడు. కానీ ఆ రైతులే కేసీఆర్ కొంపముంచారు.