Dandugula Srinivas
(వాస్తవం ప్రధాన ప్రతినిధి)
ఆర్మూర్ రాజకీయాలంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అక్కడ ఎమ్మెల్యే అయినా, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థి అయినా అంతా వివాదాలకు కేంద్ర బిందువులుగా ఉండే నేతలే. అందుకే వారెప్పడూ వార్తల్లో నిలుస్తారు. వారి మాటలు, చేతలు వైరల్ అయిపోతూ ఉంటాయి. ఏదో చేసేస్తారు. మరేదో మాట్లాడుతారు వార్తల్లోకెక్కుతారు. అంత ఫేమస్ ఆర్మూర్ పాలిటిక్స్. ఇప్పుడీముచ్చటంతా ఎందుకంటే… ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి వార్తల్లోకెక్కాడు. కవితపై సానుభూతి చూపడమే ఆయన చేసిన పొరపాటు. దీనిపై భిన్న కామెంట్లు ఆయనపై విరుచుకుపడుతున్నాయి. ఒకరు సారు సూపరు.. అక్క కోసం మంచిగా మాట్లాడిండు అంటే.. ఇంకొకరేమో చాలు చాల్లే ఆమె జైలుకు పోవడానికి కారణం నువ్వు కాదా..? ముందు ఆమెకు క్షమాపణ చెప్పు అంటూ తిట్ల దండకం అందుకున్నారు.
కవిత పైన ఎంత విషం చిమ్మిన్రు … ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లాలో బిజెపి నాయకులు అంతా కవిత పైన నోటికి వచ్చినట్టు వాగిండ్రు ఆ వీడియోలు మా దగ్గర లేవా..
ఎంత ఘోరం పాపం ఒక ఆడబిడ్డను తీవ్రవాదులు ఉన్న జైల్లో ఉంది మీకు కనికరం లేదా ..ఆ బిడ్డ తండ్రి మనస్సు ఎంత బాధ పడుతుందో ఒకసారి ఆలోచించారా ??
మీరు మీ కుటుంబాలతో హాయిగా ఉన్నారు …You are enjoying your life ….MR MLA …..నేను కవిత పైన తప్పుగా మాట్లాడిన ఎన్నికల సమయాన అని క్షమాపణ కోరు ముందు …..
తూ నీతి లేని నువ్వు ఎన్నికల సమయాన చేసింది మాకు తెలియదా చేసింది అంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా …. నువ్వు కేసీఆర్ కుటుంబం పైన మాట్లాడిన వీడియోలు బయట పెట్టనా…, కవిత జైలుకు పోవడం లో నువ్వు కూడా ఒక కారణం మీ అధిష్టానానికి నువ్వు రిపోర్ట్ ఇయ్యలేదా ???
Kulakarni Dharinidhar
ఇది సోషల్ మీడియాలో తాజాగా ట్రోల్ అవుతున్న టాపిక్.
అంతకు ముందు ఏదో మీడియాలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ కవితపై సానుభూతి వ్యాఖ్యలు మాట్లాడాడు. దీన్ని కళ్లకు అద్దుకుని ఇలా నమస్తే తెలంగాణ రాసేసుకుంది. ఆ వార్త క్లిప్పింగును తీసుకుని బీఆరెస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, కవిత అభిమానులు కొందరు దీన్ని తెగ వైరల్ చేసేసుకున్నారను. శభాష్.. రాకేశ్ అనే రేంజ్‌లో కన్నీటి భాష్పాలు రాల్చారు. కానీ అందుకు విరుద్దంగా కులకర్ణి ధరణీధర్ అనే వ్యక్తి మాత్రం ఇలా రాకేశ్‌ను ఏకిపారేశాడు. ముందు కవితకు క్షమాపణ చెప్పు అని నిలదీశాడు. బీజేపీ లీడర్లంతా కలిసి ఆమెను ఇలా జైలు పాలు చేశారని దుమ్మెత్తిపోశాడు.
కవిత జైలుకు వెళ్లేందుకు నువ్వూ ఓ కారణమేనని స్పష్టం చేశాడు. ఇలా మళ్లీ వార్తల్లో కేంద్రబిందువయ్యాడు ఆర్మూర్ ఎమ్మెల్యే. ఆర్మూర్ అంటేనే రాజకీయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అక్కడ ఇంతకు ముందున్న ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వివాదాలకు కేంద్రబిందువయ్యాడు. తాజాగా గెలిచిన ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కూడా తన కామెంట్లతో ఎప్పూడే ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు.
వీరిద్దరు ఎన్నికలు ముగిసిన తరువాత మీడియాకెక్కి కొట్టుకున్నంత పనిచేశారు. ఇప్పుడు అలిసిపోయి ఇద్దరూ సైలెంటయ్యారు. వీరిద్దరే కాదు కాంగ్రెస్ నుంచి ఓడిన అభ్యర్థి వినయ్‌రెడ్డి కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు. అక్రమ వసూళ్లు చేస్తున్నాడని విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. షాడో ఎమ్మెల్యేగా మారి అందరినీ బెదిరిస్తున్నాడనే ప్రచారమూ ఉంది. ఇలా ఆర్మూర్‌లో ఓడిన , గెలిచిన ఎమ్మెల్యేలంతా ఇక్కడ వివాదాలకే కేరాఫ్ అడ్రస్‌లుగానే ఉన్నారు.