వాస్తవం – హైదరాబాద్:
కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసునని, త్వరలో కేటీఆర్ జైలుపాలుకాకతప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.
బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, కవిత బెయిల్‌కు, బీజేపీకి సంబంధం లేదన్నారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదన్నారు. అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత చురగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు. కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయన్నారు.