(దండుగుల శ్రీనివాస్)
ఈ మధ్య ఫేస్‌బుక్‌లో హార్డ్‌కోర్ బీఆరెస్ సపోర్టర్ ఒకరు ఓ పోస్టు పెట్టారు. అదేమంటే.. టీ న్యూస్, నమస్తే తెలంగాణను ఎందుకు ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఎందుకు వెనకబడ్డాయి..? ఈ రెండింట్లో నడుస్తుందేమిటీ..? ఇలా అయితే ఇవెప్పుడు బాగుపడతాయి… అనే విధంగా ఉన్నదున్నట్టుగా పెట్టిన ఆ పోస్టు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టింది. బీఆరెస్ నేతలకూ కనువిప్పు కలిగించేలా ఉందా పోస్టు.
అంటే స్వపక్షంలోనే అంతలా వీటిపై అసంతృప్తి పేరుకుపోయింది. కానీ ప్రభుత్వం పడిపోయినా కూడా కేసీఆర్, కేటీఆర్‌లు మాత్రం వీటి వైపు చూడలేదు. అనుకోకుంటా చెప్పాపెట్టకుండా పెనుతుఫాను మాదిరిగా టీన్యూస్‌లో ఓ భారీ మార్పు జరిగింది.
ఆ న్యూస్ ఛానల్ సీఈవోగా శైలేశ్‌రెడ్డిని నియమించారు ఇవాళ. అంతకు ముందు టీశాట్‌కు ఆయన సీఈవోగా ఉన్నాడు. దీనికి పూర్వం జీ న్యూస్ బాధ్యతలు మోశాడు. బీఆరెస్ పెద్దలతో మంచి సంబంధాలు మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. పర్వాలేదు. ప్రక్షాళన మొదలైందని అనుకుందాం. మరి తరువాత స్టెప్ నమస్తే తెలంగాణలో ఉంటుందా..? ఏమో అలాగే అనిపిస్తుంది.