న‌మ‌స్తే తెలంగాణ‌లో ఏం జ‌రుగుతోంది..! కేటీఆర్ వార్నింగ్‌….!!

వాస్త‌వం ఎఫెక్ట్‌…!!

తెగుతున్న తిగుళ్ల తీగ‌లు.. !

గ్రూప్‌-1 మెయిన్స్ పై ప్ర‌భుత్వానికి అనుకూలంగా వార్త రాసి ఇజ్జ‌త్ తీసి….

(దండుగుల శ్రీ‌నివాస్‌)

గ్రూప్‌-1 మెయిన్స్ లో ప్ర‌భుత్వం చేస్తున్న అవ‌క‌త‌వ‌క‌ల‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతున్న తరుణంలో బీఆరెస్ పోరాటాల‌కు సిద్ద‌మవుతుండ‌గా.. ఆ పార్టీ క‌ర‌ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ మాత్రం వేరు పాట అందుకున్న‌ది. పాజిటివ్ వార్త‌లు గుప్పిస్తున్న‌ది. ప్ర‌భుత్వానికి అనుకూలంగా , నిరుద్యోగుల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. ఇదే వార్త‌ను వాస్త‌వం ఎక్స్‌క్లూజివ్‌గా రాసింది.

దీనిపై ఇవాళ కేటీఆర్ న‌మ‌స్తే తెలంగాణ మేనేజ్‌మెంట్‌కు క్లాస్ తీసుకున్నాడు. అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతోంది..? అని ఎడాపెడా, చెడామ‌డా తిట్టిన‌ట్టు తెలిసింది. ఇంకా ప‌ద్ద‌తి మార్చుకోరా..? ఇలాగైతే ఎలా..? అని సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చాడ‌ని తెలిసింది. ఇప్ప‌టికే సీపీఐ పార్టీ పేద‌ల కోసం వేసిన గుడిసెల్లో త‌మ‌కూ వాటా కావాలని అడిగి అభాసుపాలైన వైనం పార్టీ పెద్ద‌ల‌కు చేరింది. ఇప్ప‌టికే పార్టీ ప‌రిస్థితి బాగాలేదు. అంతో ఇంతో ఆదుకోవాల్సిన ప‌త్రిక కూడా ఇలా బ‌జారు పాల‌వుతుంటే చూస్తూ ఎలా స‌హిస్తారు..? అదే చేశాడు కేటీఆర్‌.

You missed