ఐదు నెలలుగా కవిత తీహార్ జైలులో నరకం అనుభవిస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెను బయటకు రానీయకుండా చేస్తున్నారు. ఎన్నిసార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా కోర్టు తిరస్కరిస్తూ వస్తోంది. తాజాగా కవిత బెయిల్‌పై వాదనలు ఈనెల 21కు వాయిదా వేయగా.. తప్పుకుండా బెయిల్ వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఆమె బెయిల్ కోసం ఎదురుచూసీ చూసీ విసిగి వేసారి పోయారు బీఆరెస్ శ్రేణులు. ఇక ఆమె రాజకీయ భవిష్యత్ అంధకారమే అనేరీతిలో కామెంట్లు కూడా చేస్తున్నారు ఇంటా బయట. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యస్థితిపై కేటీఆర్ అధికారికంగ వెల్లడించారు. ఆమె తీవ్ర అనారోగ్యం కారణంగా 11 కిలోల బరువు తగ్గిందని పేర్కొన్న కేటీఆర్ .. ఆమెకు బీపీ కూడా అటాక్ అయ్యిందని, బీపీ నియంత్రణకు రోజుకు రెండు మాత్రలు వేసుకుంటున్నదని కూడా తెలిపాడు.