ఎవని పాలయిందిరో తెలంగాణ
ఎవడేలుతున్నాడురో తెలంగాణ
**********
ఆయన మంత్రో, ఎమ్మెల్యేనో కాదు. అనుముల కొండల్ రెడ్డికి ఉన్న ఏకైక అర్హత రేవంత్ రెడ్డి సోదరుడు కావడమే.
ఆయనిప్పుడు ఒక ఎమ్మెల్యేను, కొంత మంది జర్నలిస్టు మిత్రులను వెంటేసుకుని ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నడు. అక్కడ ఏదేదో “పరిశీలిస్తున్నడని” పక్కన ఉన్న ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన సమావేశంలో ఎన్నికైన ఎమ్మెల్యే ఒక పక్కన ఒదిగి కూర్చుంటే, కొండల్ మాత్రం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా సింహాసనం మీద కూర్చున్న ఫోటో ఇవ్వాళ సోషల్ మీడియాలో తిరుగుతుంది.