సిల్లీ పాయింట్‌

గ‌త ప‌దేండ్లుగా చూస్తున్న‌.. తెలంగాణ వ‌చ్చినంక రాష్ట్రంలోని ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి పెట్టుబ‌డుల వ‌ర‌ద వ‌స్తున్న‌ద‌ట‌.. ఉద్యోగ ధ‌ర్మంలో భాగంగా నేను రాసిన పెట్టుబ‌డుల వార్త‌ల విలువే దాదాపు 20 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంది. కాంగ్రెస్ వ‌చ్చినంక సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి రూ.40 వేల కోట్ల పెట్టుబ‌డులు తెచ్చార‌ట‌, ఇప్పుడు అమెరికా వెళ్లి మ‌రో రూ.16 వేల‌కోట్లు తెస్తార‌ని చెప్తున్నారు.
….
మ‌రి ఈ పెట్టుబ‌డులన్నీ ఏమైతున్న‌య్‌?

రాష్ట్ర రెవెన్యూ పెర‌గ‌లేదు..
యువ‌త‌కు ఉద్యోగాలు పెర‌గ‌లేదు..
ఎక్క‌డా కంపెనీలు క‌నిపిస్త‌లేవు..
మ‌రి ఏవీ ఈ పెట్టుబ‌డులు…
……….
నాటి నుంచి నేటివ‌ర‌కు స‌రిగ్గా గ‌మ‌నిస్తే ఒక విచిత్రం క‌నిపిస్త‌ది..
….
విదేశీ పెట్టుబ‌డులు… అని పేప‌ర్ల‌లో, టీవీలో క‌నిపించే ఫొటోల్లో మ‌న పాల‌కుల‌తో క‌నిపించే పెట్టుబ‌డిదారుల్లో 90 శాతం.. ఇక్క‌డివారే..
కోట్లు, సూట్లు వేసుకొని చ‌లువ అద్దాలు పెట్టుకొంటారు కాబ‌ట్టి త్వ‌ర‌గా గుర్తించ‌లేక‌పోవ‌చ్చు.. కానీ అదే నిజం.
…….
పెట్టుబ‌డుల ప్ర‌క‌ట‌న వ‌స్తుంది..
ఆ కంపెనీకి విలువైన భూముల కేటాయింపు వార్త కూడా వ‌స్తుంది..
కానీ…
కంపెనీ మాత్రం క‌నిపించ‌దు… (చాలా వ‌ర‌కు)
……………
హైటెక్ వ్య‌భిచారం అన్న‌ట్టుగా… ఇదంతా ఒక అత్యాధునిక భూ ఆక్ర‌మ‌ణ కుంభ‌కోణం.
…….
పెట్టుబ‌డులు తెచ్చేందుకు వెళ్లేవాడు..
చ‌ర్చ‌లు జ‌రిపేవాడు..
పెట్టుబ‌డులు పెట్టేవాడు..
వాడికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపేవాదు..
భూములు ఇచ్చేవాడు..
………. అంతా ఒక్క‌డే…
అధికారంలో ఉన్న‌వాడు… నాడైనా.. నేడైనా..
……
ఇదంతా ఆస్కార్‌కు కూడా అంద‌ని అద్భుత బ‌హువిధ న‌ట‌నా కౌష‌లం..
ఎఫ్‌బీఐ కూడా గుర్తించ‌లేని దోపిడీ..

 

Venu Bekkam

You missed